పవన్ కళ్యాణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో ఈ ప్రాజెక్టు రూపొందపోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే, నిజానికి విజయ్తో చేసిన ‘వారసుడు’ సినిమా తరువాత వంశీ పైడిపల్లి ఇప్పటివరకు ప్రాజెక్ట్ ఫైనల్ చేయలేదు. ఆయన ఆ మధ్య కాలంలో అమీర్ ఖాన్ కోసం ఒక కథ రాసుకున్నట్లు ప్రచారం జరిగింది. రాసుకోవడమే కాదు, ఆయన దగ్గరకు వెళ్లి వినిపించి కూడా వచ్చాడు. అయితే, ఆయన ఎందుకో ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
Also Read :Darshan Posani : జూనియర్ ప్రభాస్ గా సూపర్ స్టార్ మహేశ్ మేనల్లుడు
ఈ నేపథ్యంలోనే, అదే కథను సల్మాన్ ఖాన్ దగ్గరికి కూడా తీసుకువెళ్లాడు. అక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు ప్రచారం జరిగిన ప్రాజెక్టు మాత్రం ఫిక్స్ కాలేదు. అయితే, ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్‌తో ప్రాజెక్ట్ సెట్ కావడంతో పవన్ ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. నిజానికి ఈ కథ, సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కథే అని, ఆయన చివరి నిమిషంలో చేయలేనని చెప్పడంతో అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకువచ్చారని అంటున్నారు. అసలు ఆ కథ ఏమిటి, పవన్ కళ్యాణ్ వంశీ పైడిపల్లి డీల్ చేయగలడా అనే విషయం మీద పవన్ ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు.
Also Read :NBK 111 : బాలయ్య సరసన నయనతార ఫిక్స్.. మరో హిట్ లోడింగ్
నిజానికి పవన్ కళ్యాణ్‌కి దర్శకులతో పనిలేదు. కొత్త దర్శకులైనా, అనుభవం ఉన్న దర్శకులైనా ఆయనను కథతో మెప్పించి హిట్లు కొట్టిన వాళ్ళున్నారు. కథతో మెప్పించాక సరిగా తీయలేక ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. వంశీ పైడిపల్లి ట్రాక్ రికార్డు చూస్తే పవన్ ఫ్యాన్స్ మాత్రం టెన్షన్లో ఉన్నారనే చెప్పాలి. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఆ టెన్షన్ ఎప్పుడు క్లియర్ అవుతుందో, అసలు ఆ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వస్తుందో లేదో అనేది కాలమే నిర్ణయించాలి.
