Pawan Kalyan: చిరంజీవి ముసుగు కట్టుకొని సినిమా థియేటర్ కి వెళ్ళేవాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. అల్లు అర్జున్ అంశంను గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారన్న ఆయన సారీ చెప్పడానికి పలు విధానాలు ఉంటాయని, ఘటన జరిగిన రెండో రోజే వెళ్లి మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదన్నారు. అయితే అదే సమయంలో ఒకప్పుడు చిరంజీవి కూడా ఇలా రిలీజ్ రోజు సినిమాలకు వెళ్లేవారని కానీ ముఖానికి ముసుగు కట్టుకుని వెళ్లేవారని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని కెమెరాలు అన్నీ గమనిస్తున్నాయని అన్నారు. తానూ ఒక్కోసారి కళ్ళు మాత్రమే కనపడేలా వెళ్లినా గుర్తు పట్టేసే వారని ఆయన అన్నారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో గౌరవం, మర్యాదతో వ్యవహరించిందని.. సినిమా విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రోత్సాహం ఇచ్చారని పవన్ ప్రశంసించారు.
Pawan Kalyan: OG OG అని అరుస్తుంటే బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి!
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరిలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్టు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడారు. ‘తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు. కింది స్థాయి నుంచి ఎదిగారు. సీఎం రేవంత్ బెనిఫిట్‌షోలకు అవకాశం ఇచ్చారు. టికెట్ ధర పెంపునకూ వెసులుబాటు కల్పించారు. సీఎం సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయి. పుష్ప 2 సినిమాకు సీఎం రేవంత్ పూర్తిగా సహకరించారు. టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అని కూడా అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో గౌరవం, మర్యాదతో వ్యవహరించింది. అల్లు అర్జున్ విషయంలో ముందు, వెనుక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. అయితే ఒకటి మాత్రం చెప్పగలను.. చట్టం అందరికీ సమానం. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టలేం. వారు ఎప్పుడూ భద్రత గురించే ఆలోచిస్తారు’ అని డిప్యూటీ సీఎం అన్నారు.
తాజావార్తలు
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
-
Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
-
Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
-
Electricity Bill Reduction : ఇలా చేస్తే మీ కరెంట్ బిల్లు సున్నా!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?