OG 2: ‘ఓజీ 2’ పరిస్థితి ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్‌కు ‘ఓజీ’ ఊపిరి పోసింది. సినిమా సూపర్ హిట్ కాకపోయినా బ్రేక్ ఈవెన్ అయింది. వయలెన్స్ హద్దులు దాటినా, పవన్‌కి ఇచ్చిన ఎలివేషన్స్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చాయి. పవన్ కెరీర్లో ఇంతవరకు 200 కోట్ల సినిమా కూడా లేదు, ‘ఓజీ’తో ఫస్ట్ టైమ్ 300 కోట్ల క్లబ్లో చేరాడు పవన్. ‘ఉస్తాద్’ ఫ్లాప్ తర్వాత రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో సినిమా ప్రకటించినా, ఇప్పట్లో ఉండేటట్టు కనిపించడం లేదు. నెక్స్ట్ నటించే సినిమా ‘ఓజీ 2’ అంటూ పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు.
అయితే, దర్శకుడు సుజిత్.. నానితో ‘బ్లడీ రోమియో’ మూవీకి కమిట్ అయ్యాడు. లేటెస్ట్గా పవన్‌కు ఆపరేషన్ జరగడంతో మూడు, నాలుగు నెలల వరకు రెస్ట్ తీసుకుంటాడని.. ఈ లెక్కన ‘ఓజీ 2’ ఇప్పట్లో ఉండదన్న ప్రచారం నడుస్తోంది. ‘ఓజీ’ రిలీజ్‌కు ముందే సుజిత్, నానితో ‘బ్లడీ రోమియో’ మూవీని అనౌన్స్ చేశాడు. అయితే నాని ‘పారడైజ్’తో బిజీగా ఉండడంతో సుజిత్ సినిమా పట్టాలెక్కలేదు. ‘పారడైజ్’ మూవీ ఇప్పట్లో పూర్తయ్యేటట్టు కనిపించడం లేదు. పవన్ కోలుకున్నాక ‘ఓజీ 2’ పూర్తి చేసిన తర్వాతే ‘బ్లడీ రోమియో’ తీయనున్నాడు సుజిత్.
Also Read
- JR NTR Office : 'RAW NTR' సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆఫీస్
- Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
- Ram Charan : హైదరాబాద్ శివార్లలో రామ్ చరణ్ లగ్జరీ ఫామ్‌హౌస్.. త్వరలోనే గృహప్రవేశం
- Lenin Monday Test : అయ్యగారు ఇప్పట్లో ఆగేలా లేరు.. సోమవారం సూపర్ హోల్డ్
పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేం. త్వరలోనే మరో భుజానికి కూడా ఆపరేషన్ చేయాల్సి ఉంది. మూడు నెలల పాటు రెస్ట్ తీసుకుంటాడా, లేదంటే ఆరు నెలలు తీసుకుంటాడో తెలీదు. గ్యాప్ ఎంత వచ్చినా ‘ఓజీ 2’ పూర్తయిన తర్వాతే సుజిత్ ‘బ్లడీ రోమియో’ తీస్తాడని తెలిసింది.
తాజావార్తలు
-
OG 2: ‘ఓజీ 2’ పరిస్థితి ఏంటి?
-
Tom Cruise: గుర్తుపట్టలేనంతగా మారిన టామ్ క్రూజ్.. ‘డిగ్గర్’ ట్రైలర్లో షాకిచ్చిన లుక్!
-
Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
-
JR NTR Office : ‘RAW NTR’ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆఫీస్
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్‌పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!