పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాలో విడుదలకు సిద్ధం అవుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజుచ, నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే..
Also Read : Rakul : అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేస్తున్నారు..
ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక్క అప్ డేట్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా తాజాగా కీరవాణి స్వరపరచిన ‘తారా తారా – ది సిజ్లింగ్ సింగిల్’ అనే లిరికల్ ట్రాక్ రిలీజ్ టైమ్‌ను టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల మే 28న ఉదయం 10:20 గంటలకు ఈ పూర్తి పాట విడుదల కానుంది అని తెలిపింది. అలాగే నిధి అగర్వాల్ కి సంబంధిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కాగా ఈ సాంగ్ కోసం పవన్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ ట్రాక్ చాలా బాగా వచ్చింది అని టాక్.. మరి పూర్తి పాట ఎలా ఉందో చూడాలి అంటే వెట్ చేయక తప్పదు.
#TaaraTaara – The Sizzling Single! 🔥
Get ready to groove to the hottest track of the year from #HariHaraVeeraMallu 💃
Full song out on 28th May @ 10:20 AM! 💥
All set to Turn up the volume, and feel the heat! 🔊⚡️#HHVMonJune12th #HHVM #DharmaBattle #VeeraMallu
Powerstar… pic.twitter.com/2wQ85AZ6hv
— Mega Surya Production (@MegaSuryaProd) May 26, 2025