ఒక్కప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. అలా అనతి కాలంలోనే నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ప్లాపులతో డీలా పడిపోయింది. దీంతో టాలీవుడ్ నుండి కోలీవుడ్, బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. కానీ ప్రజంట్ తమిళంలో మాత్రం రెండు మూడు సినిమాలు లైన్‌లో పెట్టింది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అబార్షన్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది..
Also Read : Retro : సూర్య ‘రెట్రో’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే ?
రకుల్ మాట్లాడుతూ.. ‘అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబార్షన్ చేయించుకోమని సులభంగా చెప్పేస్తారు. అప్పుడే పిల్లలు వద్దు అనుకునే వారి కోసం చాలా రకాల మార్గాలు ఉన్నాయి. అవి ఎంచుకోకుండా అబార్షన్ బాట పడుతున్నారు. కానీ అది ఎంత కష్టమో ఎవరు అర్థం చేసుకోవడం లేదు. స్కిన్ లేయర్ పీల్ చేస్తేనే ఎంత నొప్పి ఉంటుంది? అలాంటి ఒక జీవాన్ని శరీరం నుండి తొలగించాలంటే ఆడవారికి శారీరకంగా, మానసికంగా, భావోద్వేగమైన బాధ భయం ఉంటుంది. దీని గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు?. సైన్స్ ప్రకారం ఒక స్త్రీ శరీరం రెండు మిస్‌క్యారేజ్‌లను మాత్రమే భరించగలదు, కానీ ఐదుగురిలో ఇద్దరు మహిళలు మూడు నుంచి ఐదు అబార్షన్లు చేయించుకుంటున్నారు. ఈ నొప్పి గురించి భర్తలు తెలుసుకొని, భార్యలకు మద్దతు ఇవ్వాలి’ అని రకుల్ ఆవేదన వ్యక్తం చేసింది. పరాయి దేశాలలో అబార్షన్ అనే మాట వచ్చిన జైల్లో వేస్తారు.. అలాంటి రూల్ ఇక్కడ కూడా పాస్ చేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.