గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ప్రమోషన్స్ చివరి దశకు చేరుకున్నాయి ముంబైలో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ చేయడం, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సెర్ట్ నిర్వహించడం, ఆ తర్వాత బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో ప్రెస్ మీట్స్‌తో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశారు . ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మేకర్స్ సర్వం సిద్ధం చేశారు .
ఈ భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది జూన్ 1వ తేదీన (సోమవారం) సాయంత్రం 5 గంటల నుండి విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం (గ్రౌండ్స్) వేదికగా ఈ ఈవెంట్ అత్యంత ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు భారీ ఎత్తున మెగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, అందుకు తగ్గట్టుగా నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథి (చీఫ్ గెస్ట్) ఎవరనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మేకర్స్ నుండి ఇంకా అధికారిక స్పష్టత రానప్పటికీ, ఈ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ వీలును బట్టే విజయవాడలో ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేశారని టాక్. ఇదే గనుక నిజమైతే.. ఒకే వేదికపై బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్‌లను చూసి మెగా అభిమానులకు పూనకాలు రావడం ఖాయం.ఈ వేడుకలో హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సనలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేయనున్నారు
