NTV Telugu Site icon

Pavan Kalyan : OG లో అకీరా నందన్.. షూటింగ్ ఫినిష్

Og

Og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ఫిల్మ్ OG. ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూట్ పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాల వలన కొన్ని నెలలు పాటు పక్కన పెట్టారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేసారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ పై DVV దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు.

Also Read : Shah Rukh : దర్శకుడిగా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్

ప్రస్తుతం హీరో లేని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుజిత్. కోల్ కతా నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది OG. కాగా ఇప్పుడు ఈ సినిమా నుండి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ హై యాక్షన్ సినిమాలో పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ నటిస్తున్నాడు. రెండు రోజుల క్రితం అకిరా నందన్ కు సంబంధించి షూట్ కూడా ముగించారట. సినిమా చివరలో వచ్చే కీలక సన్నివేశంలో అకిరా కనిపించబోతున్నాడట. ఈ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని చెబుతోంది యూనిట్. పవన్ కళ్యాణ్ అలాగే అకిరా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారా అనేది క్లారిటీ రాలేదు. ఏదేమైనా తాము ఎంతగానో ఎదురుచూస్తున్న తమ అభిమాన హీరో వారసుడు టాలీవుడ్ ఎంట్రీ న్యూస్ పై ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్

Show comments