మన టైమ్ బాగా లేనపుడు అంది వచ్చిన అవకాశాలను కూడా చేజేతులా చేజార్చుకుంటుంటాం. అలాంటి సంఘటనే మలయాళ కుట్టి పార్వతీ నాయర్ కి ఎదురైంది. అమ్మడు తిరస్కరించిన ఓ సినిమా సెన్సేషనల్ హిట్ అయి ఆ తర్వాత ఇతర భాషల్లోనూ రూపొంది అక్కడా విజయం సాధించింది. ఆ సినిమానే మన విజయ్ దేవరకొండకు స్టార్ డమ్ తెచ్చిన ‘అర్జున్ రెడ్డి’. ఇంటిమసీ సీన్స్ తో పాటు లిప్ లాక్ సన్నివేశాలు ఎక్కువా ఉన్నాయనే కారణంగా అమ్మడు తన దరికి వచ్చిన ఆఫర్ కి నో చెప్పిందట. ఇటీవల ఇన్‌స్టా చాట్ సెషన్‌లో ఓ అభిమాని ‘అర్జున్ రెడ్డి’ మిస్ చేసుకున్నందుకు బాధ పడుతున్నారా అని అడిగాడట. “నిజంగానే బాధగా ఉంది. నిజానికి ఆ సినిమాను మిస్ చేసుకుని ఉండకూడదు.
Read Also : ధోనితో రణ్వీర్ సింగ్ ఫుట్ బాల్ మ్యాచ్… పిక్స్ వైరల్
అదో అందమైన చిత్రం” అని చెబుతూ అలాంటి అందమైన సినిమాలు మళ్లీ నా ముందుకు వస్తాయని ఖచ్చితంగా నమ్ముతున్నాను అనేసింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘అర్జున్ రెడ్డి’లో విజయ్ దేవరకొండ, శాలిని పాండే ముఖ్య పాత్రలు పోషించగా… వారి కెరీర్స్ లో గుర్తుండిపోయే సినిమాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. ఇదే హిందీలో ‘కబీర్ సింగ్’, తమిళం ‘ఆదిత్య వర్మ’గా రీమేక్ అయి ఆ యా భాషల్లో నటించిన వారికి కూడా మంచి పేరు తేవటం విశేషం. పార్వతి నాయర్ ‘ఉత్తమ విలన్, ఎన్నై అరింధాల్’ వంటి చిత్రాలతో నటించినా తగినంత గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. ప్రస్తుతం మరి కొన్ని సినిమాల్లో నటిస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఇప్పుడు బాధ పడుతున్న పాదర్వతికి రాబోయే సినిమాలు ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడతాయో చూడాలి.