Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!

Kumari Aunty

Kumari Aunty

నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘పాంచాలి పంచభర్తృక’. గంగ సప్తశిఖర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్‌, ఓం సాయిరాం ఆర్ట్స్ బ్యానర్లపై ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో సినిమా డైరెక్టర్ గంగ సప్తశిఖర మాట్లాడుతూ “సినిమా మీకు నచ్చకపోతే మా రాయల్ థ్రోన్ ఇన్స్టాగ్రామ్ పేజీకి టికెట్ పోస్ట్ చేయండి, మీ డబ్బులు రిటర్న్ ఇస్తాం. ఈవీవీ, జంధ్యాల, అనిల్ రావిపూడి సినిమాలాగే ఫ్రేమ్ నిండా 50 మందికి పైగా ఆర్టిస్టులతో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని మలిచాం. రాజేంద్రప్రసాద్ గారు పాటలు, ఫైట్స్ చేసి సినిమాను వేరే లెవెల్‌కి తీసుకెళ్లారు.” అని అన్నారు.
మీల్స్ స్టాల్ పెట్టి అవి అమ్ముతూ ఫేమస్ అయిన  కుమారి ఆంటీ మాట్లాడుతూ యూట్యూబ్ లో నన్ను ఫేమస్ చేశారు. సినిమాల్లోకి వస్తానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ఈ చిత్రంలో నటించే అవకాశం  కల్పించిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ మూవీ నన్ను మీకు మరింత దగ్గర చేస్తుందని ఆశిస్తున్నా. అన్నారు. ఇక ఈ సినిమాలో రోల్ రిడా, సరీ ఫర్, రాజ్ పవన్, జెమినీ సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.