ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటిగా దూసుకుపోతోంది అమెజాన్ ప్రైమ్ వీడియో. సౌత్ కంటెంట్ మీద ఫోకస్ పెడుతున్న ఈ సంస్థ తాజాగా తన ఉద్యోగిని సౌత్ ఇండియా ఒరిజినల్స్ కు కొత్త హెడ్ గా నియమించారు. తాజాగా పద్మ కస్తూరిరంగన్ సౌత్ ఇండియా ఒరిజినల్స్ కు కొత్త హెడ్ గా నియమితులయ్యారు. పద్మ కస్తూరిరంగన్ రెండేళ్ల కిందట ప్రైమ్ వీడియోలో చేరగా ఆమె ప్రతిభకు పట్టం కడుతూ ఇప్పుడు ఏకంగా హెడ్ స్థానానికి వెళ్లారు. అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో ఫిల్మ్ కోర్స్ చేసిన ఆమె… ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి పని చేశారు. కొన్నాళ్ల పాటు అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఫిల్మ్ స్కూల్ లో కీలక బాధ్యతలు నిర్వర్తించి ఆ తరువాత తమాడ మీడియాలో కూడా హెడ్ గా అనేక ప్రోగ్రామ్స్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించింది.
Pushpa 2: ఇంకెక్కడి బాహుబలి, RRR.. రికార్డులన్నీ రప రపే!
ఇక కొద్దికాలం పాటు జీ5 ఓటీటీలో పనిచేసిన పద్మ కస్తూరిరంగన్ ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో జాయిన్ అయి తనదైన ముద్ర వేశారు. ఇటీవల ప్రారంభమైన ది రానా దగ్గుబాటి షో కూడా పద్మ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే అనే అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు సౌత్ మీద మరింత ఫోకస్ పెట్టిన ఆమెజాన్ ఆమెను ఇప్పుడు సౌత్ ఇండియా ఒరిజినల్స్ హెడ్ గా నియమించింది. ఇక ఈ నియామకం గురించి పద్మ కస్తూరి రంగన్ స్పందిస్తూ అమెజాన్ ప్రైమ్ వీడియో యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. సరికొత్త పంథాలో ప్రేక్షకులను అలరించేందుకు, ప్రైమ్ వీడియోను ఉన్నత స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో నిలిపేందుకు ఇకపై కూడా శ్రమిస్తానని ఆమె అన్నారు.