Pa Pa: గుండెలని పిండేసేలా ‘పా.. పా’ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ బ్లాక్ బస్టర్ మూవీ డా..డా’ మూవీ తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో జెకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 13న ఈ మూవీ ఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఆ సందర్భంగా తాజాగా ‘పా.. పా..’ మూవీ ట్రైలర్‌ను క్రేజీ డైరెక్టర్ మారుతి విడుదల చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. తమిళ సెన్సేషనల్ మూవీ ‘డా..డా’ తెలుగులో ‘పా.. పా..’ పేరిట విడుదలవ్వడం సంతోషంగా ఉందని, ఈ సినిమా తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ సబ్జెక్ట్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందన్నారు. ‘పా.. పా..’ చిత్రయూనిట్‌కు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది తమిళంలో ‘డా..డా’ మూవీ సెన్సేషనల్ హిట్ సాధించింది. కవిన్, అపర్ణ దాస్ ప్రధాన పాత్రదారులుగా, డైరెక్టర్ గణేష్ కె బాబు తెరకెక్కించిన ‘డా..డా’ చిత్రం తమిళ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది.
Seize the Ship: ‘సీజ్ ద షిప్’ క్రేజ్.. ఏకంగా సినిమా?
Also Read
కోలీవుడ్ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించింది. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 30 కోట్లు వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. హార్ట్ టచ్ అయ్యే పాటలు ఈ సినిమాకు మరో హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఒకప్పటి పాపులర్ సాంగ్స్ మాదిరిగానే ఈ సినిమా పాటలు స్థిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలోని పాటలు చాలా హైలెట్ గా నిలుస్తాయని అన్నారు. తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కి తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘డా..డా’ చిత్రం ‘పా.. పా..’ పేరుతో తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుందని నిర్మాత నీరజ కోట తెలిపారు. భావోద్వేగం, ప్రేమ, కామెడీ.. ఇవన్నీ సరైన స్థాయిలో మిక్స్ చేసిన ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా.. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్టు అవుతుందని, బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు విడుదల చేయబోతున్నారని చెప్పారు.
తాజావార్తలు
-
Indiramma Sarees: ఇందిరమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. కోటి మంది మహిళలకు కోటి చీరలు.. ఎవరు అర్హులు?
-
Kishan Reddy: దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ డ్రగ్స్.. యువత భవిష్యత్తును కాపాడుకోవాలి!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
Sonia Gandhi: ‘నాన్నను చంపించడానికే భద్రత తొలగించారు’.. రాజీవ్ గాంధీ హత్యపై సోనియా సంచలన వ్యాఖ్యలు!
-
Tollywood: స్టార్ హీరోలు తడబడితే యంగ్ హీరోలు నిలబెట్టారు.!
ట్రెండింగ్
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!