మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ రిలీజ్ “లక్కీ భాస్కర్”. దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇటీవల 25 రోజుల థియేటర్ రన్ కంప్లిట్ చేసుకుంది లక్కీ భాస్కర్. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకోగా నేటి నుండి స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. మరోవైపు థియేటర్స్ లో లక్కీ భాస్కర్ స్టడీగా కలెక్షన్స్ రాబడుతోంది. రిలీజ్ అయిన కేవలం మూడు వారాల్లోనే లక్కీ భాస్కర్ రూ. 110 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దుల్కర్ కెరీర్ బెస్ట్ సినిమా రికార్డు క్రియేట్ చేసింది లక్కీ భాస్కర్.
Also Read జ్ ; OTT : ఓటీటీలో రిలీజ్ అయిన ప్రియదర్శి, టోవినో థామస్ సినిమాలు
ఇక టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించిన ఈ సినిమాకు దర్శక ద్వయం సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను తెరకెకెక్కించారు. ఈ సినిమా 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ ఆయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు దీపావళి విన్నర్ గా నిలిచింది. కిరణ్ అబ్బవరం కెరీర్ లో బిగ్గెట్ హిట్ గా నిలిచిన ‘క’ ఈ రోజు నుండి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ స్ట్రీమింగ్ కు తీసుకువచ్చినట్టు అధికారకంగా ప్రకటించింది.