2021 ఆస్కార్ హైలైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
93వ ఆస్కార్ వేడుకలు లాస్ ఏంజెల్స్ లో ముగిసాయి. కరోనా పాండమిక్ లోనూ ఈ వేడుకలు ఆసక్తికరంగా జరిగాయి. అసలు నామినేషన్స్ ప్రక్రియనే వైవిధ్యంగా జరగటం విశేషం. ఈ ఏడాది ‘నోమాడ్లాండ్’ సినిమా ఉత్తమ చిత్రం, దర్శకత్వం, ఉత్తమ నటి విభాగాల్లో అవార్డులను గెలుపొందింది. ఈ ఏడాది అత్యధిక అవార్డులను గెలుచుకున్న సినిమా ఇదే. ఇక 78వ ఆస్కార్ అవార్డుల తర్వాత నాలుగు అంతకు మించి ఏ సినిమా అస్కార్ అవార్డులను గెలుపొందక పోవడం గమనార్హం. ఇక ‘నోమాడ్లాండ్’ దర్శకురాలు చోలే జావో ఆస్కార్ అవార్డుల చరిత్రలోనే ఉత్తమ దర్శకత్వం విభాగంలో గెలుపొందిన రెండవ మహిళ కావటం విశేషం. అయితే తొలి శ్వేతేతర జాతీయురాలు మాత్రం ఈమెనే కావటం మరీ విశేషం. ఇక సర్ ఆంటోని హాప్కిన్స్ ‘ఫాదర్’ సినిమాకు ఉత్తమ నటుడుగా అవార్డు దక్కించుకున్నారు. అస్కార్ చరిత్రలో ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న అతి పెద్ద వయసు (83 సంవత్సరాలు) ఉన్న వ్యక్తి ఈయనే. అయితే ఆంటోని హాప్కిన్స్ గతంలో ‘ద సైలెన్స్ ఆప్ ద లాంబ్స్’ సినిమాకు కూడా ఉత్తమనటుడు అవార్డు పొందారు. నిజానికి ఈ సంవత్సరం ‘బ్లాక్ బాటమ్’లో నటించిన ‘చాద్విక్ బోస్ మాన్’ కి ఉత్తమ నటుడు అవార్డు వస్తుందని భావించారు. అందరికీ షాక్ ఇస్తూ ఆంటోనీ హాప్కిన్స్ అవార్డు ఎగరేసుకుపోయాడు. ఈ ఏడాది మొత్తం 8 సినిమాలు ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీ పడ్డాయి. వాటిలో 7 సినిమాలకు ఏదో కేటగిరిలో అవార్డు దక్కటం విశేషం. ఈ ఏడాది ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో డెన్మార్క్ కి చెందిన థామస్ వింటర్ బెర్గ్ సినిమా ‘అనదర్ రౌండ్’ అవార్డ్ దక్కించుకుంది. క్రిష్టోఫర్ నోలన్ తీసిన ‘టెనెట్’ సినిమాకు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డ్ లభించింది. ఇతర విభాగాల్లో ఈ సినిమాకు చుక్కెదురైంది. అటు థియేటర్లలోనే కాదు ఇటు అవార్డుల లోనూ ‘టెనెట్’ సత్తా చాటలేకపోయిందన్నమాట. ఇక ‘మంక్, సోల్, జుడాస్, బ్లాక్ మెస్సయ్య, ద ఫాదర్, బ్లాక్ బాటమ్, సౌండ్ ఆప్ మెటల్’ వంటి పలు సినిమాలు రెండేసి అస్కార్స్ ను సాధించాయి. మన ఇండియన్ నటుడు ఇర్ఫాన్ ఖాన్, కాస్ట్యూమ్ డిజైనర్ భాను అత్తయ్యలను ఆస్కార్ మెమోరియమ్ గుర్తు చేసుకోవడం గమనార్హం.
Also Read
- Vishwanath and Sons : జననాయగన్ రికార్డ్ బద్దలు కొట్టిన 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. తెలుగు రాష్ట్రాల్లో భారీ బుకింగ్స్
- Mr Perfect Copyright Case: దిల్‌రాజుకు సుప్రీంకోర్టులో ఊరట.. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీరైట్ కేసులో కీలక పరిణామం!
- Anupama: మౌనం వీడిన అనుపమ: టాక్సిక్ రిలేషన్‌షిప్‌పై సంచలన వ్యాఖ్యలు
- NTR : ఎన్టీఆర్‌కు సర్జరీ..కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల
తాజావార్తలు
-
Vishwanath and Sons : జననాయగన్ రికార్డ్ బద్దలు కొట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. తెలుగు రాష్ట్రాల్లో భారీ బుకింగ్స్
-
Amaravati Projects: అమరావతిలో నేడు కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Nepal Violence: భారత సరిహద్దులో ఐఎస్ఐ కుట్ర? నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు..
-
Mr Perfect Copyright Case: దిల్‌రాజుకు సుప్రీంకోర్టులో ఊరట.. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీరైట్ కేసులో కీలక పరిణామం!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..