93వ ఆస్కార్ వేడుకలు లాస్ ఏంజెల్స్ లో ముగిసాయి. కరోనా పాండమిక్ లోనూ ఈ వేడుకలు ఆసక్తికరంగా జరిగాయి. అసలు నామినేషన్స్ ప్రక్రియనే వైవిధ్యంగా జరగటం విశేషం. ఈ ఏడాది ‘నోమాడ్లాండ్’ సినిమా ఉత్తమ చిత్రం, దర్శకత్వం, ఉత్తమ నటి విభాగాల్లో అవార్డులను గెలుపొందింది. ఈ ఏడాది అత్యధిక అవార్డులను గెలుచుకున్న సినిమా ఇదే. ఇక 78వ ఆస్కార్ అవార్డుల తర్వాత నాలుగు అంతకు మించి ఏ సినిమా అస్కార్ అవార్డులను గెలుపొందక పోవడం గమనార్హం. ఇక…