NTV Telugu Site icon

Release Clash: రజనీకాంత్ ‘వేటగాడు’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సూర్యతో పోటీకి రెడీ..

Untitled Design (4)

Untitled Design (4)

సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్‌’. తలైవర్ కెరీర్ లో170వ చిత్రంగా రానుంది ‘వేట్టయాన్‌’. రజనీకి జోడియా మంజు వారియర్, కనిపించనుంది. జై భీమ్ వంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మిస్తుంది.

Also Read: Aditya 369: ముచ్చటగా మూడవ సినిమా మొదలెట్టిన ఆదిత్య 369 నిర్మాత.!

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘వేట్టయాన్‌’ అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. మరోవైపు అదేరోజు సూర్య నటించిన పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రం కంగువ రిలీజ్ చేస్తున్నట్టు ఇదే వరకే ప్రకటించారు. ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కంగువను తమిళనాడులో రెడ్ జెయింట్ సంస్థ రిలీజ్ చేస్తుంది. సో సూర్య సినిమాకు ఎక్కువ థియేటర్లు దొరికే అవకాశం ఉంటుంది. ‘వేట్టయాన్‌ కు కూడా భారీ రిలీజ్ కు ఛాన్స్ ఉంది కానీ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు రావడం ఆ సినిమాల ఓపెనింగ్స్ పై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. కంగువా సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్. వారం గ్యాప్ లో రిలీజ్ చేస్తే రెండు సినిమాలకు భారీ ఓపెనింగ్  వచ్చే అవకాశం ఉందంటున్నాయి ట్రేడ్ వర్గాలు.  ‘వేట్టయాన్‌’లో రజనీకాంత్ తో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌, రానా దగ్గుబాటి , ఫహద్ ఫాసిల్ కీ రోల్ లో కనిపించనుండగా నాలుగవ సారి రజనీ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు అనిరుధ్.