తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్లపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో, హీరోయిన్స్‌గా నటిస్తున్న యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం వన్ బై ఫోర్(One/4). బ్లాక్ బస్టర్ బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బాహుబలి పళని కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయబోతున్నారు. ఈక్రమంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో హీరో వెంకటేష్ పెద్దపాలెం మాట్లాడుతూ .. ‘నాకు సినిమాలో అవకాశం ఇచ్చిన రోహిత్ గారు, రంజన గారికి థాంక్స్. కన్నడ లో సినిమా చేసిన తరువాత రోహిత్ గారితో నాకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి నాకు రోహిత్ మంచి స్నేహితుడిగా మారారు. తెలుగులో పెద్ద హీరోలతో సినిమా చేయాలని రోహిత్ ప్రయత్నిస్తున్నారు. నాది మదనపల్లి జిల్లా అని గర్వంగా చెప్పుకుంటున్నాను. టంగ్ స్లిప్ అనే పాయింట్‌తో ఈ క్రైమ్ డ్రామాను తీశాం. మా చిత్రంలో అద్భుతమైన ఆర్టిస్టులు పని చేశారు. హీరోయిన్లంతా కూడా అద్భుతంగా నటించారు. మా మూవీలో సుభాష్ గారి పాటలు, ఆర్ ఆర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. సాగర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందరినీ ఆకట్టుకుంటుంది. బాహుబలికి పని చేసిన పళని గారి టేకింగ్‌కు అందరూ ఫిదా అవుతారు. రాజమౌళి గారి స్టైల్లో ఈ మూవీని తీశారు. ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టించుకుండా సినిమాను తీశారు. డిసెంబర్ 12న వంద శాతం మేం హిట్ కొట్టబోతోన్నామ’ని అన్నారు.