ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ నుండి రానున్న రెండు నెలల కాలంలో మూడు సినిమాలు రాబోతున్నాయి. జులై మంత్ ఎండింగ్ నుండే బాక్సాఫీస్ దండయాత్రను షురూ చేస్తోంది ఈ ప్రొడక్షన్ హౌస్. అయితే ఓటీటీ రూపంలో సితార సంస్థ పంట పండింది. వారు నిర్మించే రెండు సినిమాలు భారీ ధరకు డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాయి. ముందుగా ఈ నెల 31న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్‌ను తీసుకు వస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమాను నెట్ ప్లిక్స్ రూ. 50 కోట్లకు ఓటీటీ హక్కులు కొనుగోలు చేసింది. రౌడీ బాయ్ గత చిత్రాలతో పోలిస్తే.. ఇది బిగ్ డీల్.
Also Read : Vassishta : విశ్వంభర కథ ఇదే.. ఆ సినిమాకు కాపీ లాగే ఉందిగా.?
ఇక రవితేజ మరోసారి ఎనర్జిటిక్ ఫెర్మామెన్స్‌తో రాబోతున్నాడు. మాస్ జాతర అంటూ ఆగస్టు 27న థియేటర్లలోకి ఎంటరవబోతున్నాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత హిట్ సౌండ్ వినని మాస్ మహారాజ.. ఈ సారి గట్టిగా కొట్టాలని ట్రై చేస్తున్నాడు. ధమాకాతో సెన్సేషనల్‌గా మారిన శ్రీలీల మరోసారి రవితేజతో జోడీ కడుతోంది. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ కొట్టడం…ఈ స్టార్ హీరోకు కీలకం. కాగా, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రైట్స్ డీల్ క్లోజ్ చేసారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రూ. 20 కోట్లు వెచ్చించి హక్కులు కొనుగోలు చేసింది. మొత్తానికి ప్లాప్స్ ఉన్నా ఈ స్టార్ హీరో అప్ కమింగ్ సినిమాకు ఓటీటీ రూపంలో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. మరీ మాస్ మాస్ మహారాజ ప్లాప్ ట్రాక్ దిగి హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.