OM Box Office Collections: కలెక్షన్స్ భారీగా డ్రాప్.. ‘ఓం’ బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎంత రావాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OM Movie Box Office Collections: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం’ సినిమా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంటోంది. విడుదలైన తొలి వారాంతంలో మంచి వసూళ్లతో దూసుకెళ్లిన ఈ చిత్రం.. ఆ తర్వాతి రోజుల్లో కలెక్షన్ల పరంగా భారీ డ్రాప్‌ను ఎదుర్కొంటోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఐదు రోజుల్లో విదేశాల్లో రూ. 26 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 98.99 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ చిత్రం సుమారు 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు సమాచారం. దాంతో ఓం సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని చేరుకుంటుందా? లేదా? అన్న ఆసక్తి నెలకొంది.
విడుదలైన ఐదు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి కలిపి ఓం చిత్రం మొత్తం రూ.31.77 కోట్ల గ్రాస్ వసూలు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇందులో తమిళనాడు నుంచి రూ.30.83 కోట్ల గ్రాస్ రాగా.. పుదుచ్చేరి నుంచి రూ.94 లక్షలు వచ్చాయి. తొలి వారాంతంలో మంచి వసూళ్లు సాధించినప్పటికీ.. ఆ తర్వాత కలెక్షన్లు తగ్గుముఖం పట్టడం చిత్ర బృందానికి సవాలుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. తమిళనాడు మార్కెట్ నుంచే సుమారు రూ.43 నుంచి రూ.45 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read
- Allu Arjun: అల్లు అర్జున్ ప్లాన్ అదిరింది.. మైల్ స్టోన్ మూవీకి ఎవరు?
- Amit Shah: రామాయణ టీమ్‌తో అమిత్ షా భేటీ.. రణ్‌బీర్, సాయిపల్లవికి అభినందనలు
- Social Media Star: మహేష్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన చిన్నారి..!
- Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్‌కు చేరిన అంచనాలు!
ప్రస్తుతం వచ్చిన వసూళ్లతో పోలిస్తే.. బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓం చిత్రం ఇంకా భారీ మొత్తాన్ని రాబట్టాల్సి ఉంది. రాబోయే రోజుల్లో కలెక్షన్లు మళ్లీ పుంజుకుంటేనే బ్రేక్ ఈవెన్ దిశగా సినిమా ముందుకు సాగుతుంది. లేదంటే అంతే సంగతులు. ఈ నేపథ్యంలో ఓం చిత్రంకు తదుపరి రోజులు అత్యంత కీలకంగా మారాయి. వీక్‌డేస్‌లో వసూళ్లు ఎలా ఉంటాయి?.. ప్రేక్షకుల ఆదరణతో సినిమా మళ్లీ పుంజుకుంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఓం కథ సాగుతుంది. ఇందులో కొన్ని సన్నివేశాలు నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడ్డాయి.
తాజావార్తలు
-
OM Box Office Collections: కలెక్షన్స్ భారీగా డ్రాప్.. ‘ఓం’ బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎంత రావాలంటే?
-
CM Revanth Reddy: రాజ్యాంగంపై బీజేపీ కుట్ర చేస్తోంది.. తిప్పికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
Vivo X500 Series: వివో X500 సిరీస్ భారత్‌లో లాంచ్.. 200MP కెమెరా, 7800mAh బ్యాటరీ, ధర, ఫీచర్స్ ఇవే!
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Wanaparthy: పెళ్లి విందుకు ఆహ్వానం లేకుండా వెళ్తున్నారా? జైలు, జరిమానా తప్పదంటూ వార్నింగ్ బ్యానర్..
ట్రెండింగ్
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!
-
Social Media Star: మహేష్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన చిన్నారి..!
-
Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!