Site icon NTV Telugu

Suhas: జూలై 11న ‘ఓ భామ అయ్యో రామ’

Oh Bhama Ayyo Rma

Oh Bhama Ayyo Rma

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళ జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు, పాటలకు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ చిత్రాన్ని జూలై11న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌.

Also Read: Prabhas-NTR: దటీజ్ ‘ఎన్టీఆర్-ప్రభాస్’.. నమ్మితే అంతే!

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ” ఇదొక బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్. అన్ని వర్గాలకు కావాలసిన అంశాలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందర్ని అలరిస్తుంది. ఇదొక క్యూట్‌ అండ్‌ ఎంటర్‌టైనింగ్‌ లవ్‌స్టోరీలా సినిమాలోని ప్రతి ఫేమ్‌ కలర్‌ఫుల్‌గా ఉంది. సుహాస్‌ ఎంతో ఎనర్జీ ఈ సినిమాకు బిగ్గెస్ట్‌ ప్లస్‌. రామ్‌గా సుహాస్‌, సత్యభామగా మాళవిక మనోజ్‌లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతారు. హీరోయిన్‌ మాళవిక, హీరో సుహాస్‌ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో వినోదాన్ని పంచుతాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడా కూడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాడు.

ALso Read:Caarthick Raju : బడా హీరోతో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ సెట్ చేసిన #Single డైరెక్టర్?

ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ సాధారణంగా లవ్ రొమాంటిక్ కామెడీ సినిమాలను అందరం ఇష్టపడుతుంటాము. ఇప్పుడు అదే తరహాలో సుహాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ఓ భామ అయ్యో రామ. అందరిని నవ్వించే వినోదమైన యువకుడి చుట్టూ తిరిగే ఓ కథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించాం. తప్పకుండా ఈ చిత్రం సుహాస్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుంది. జూలై 11న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు థియేటర్‌లో ఎంజాయ్‌ చేస్తారు’ అన్నారు.

Exit mobile version