పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్ సినిమా ఓజి (OG ). ప్రస్తుతం షూటింగ్ ముగించుకుని రిలీజ్ కు రెడీ అవుతోన్న ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే OG ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది. ఫైర్ స్ట్రామ్ పేరుతో వచ్చిన ఈ సాంగ్ ను నిన్న విడుదల చేశారు మేకర్స్. టాలీవుడ్ సంచలనం తమన్ సంగీతం అందించాడు. ఇటివల ఈ సాంగ్ గురించి తమన్ ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేశాడు. OG ఫస్ట్ సింగల్ బ్లాస్ట్ అవుతుందని అని అన్నారు.
Also Read : Coolie : రజనీకాంత్ ‘కూలీ’ లో కమల్ హసన్..
మొత్తానికి OG ఫస్ట్ సింగిల్ బయటకు వచ్చింది. ఊరించి ఊరించి రిలీజ్ చేసిన ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సాంగ్ కు తెలుగు లిరిసిస్ట్ విశ్వ రచన చేశారు. పవర్ స్టార్ ఇమేజ్ తగ్గట్టుగా సూపర్బ్ లిరిక్స్ అందించారు విశ్వ. గతంలో ఈయన రాసిన అతడు, దూకుడు టైటిల్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు OG సాంగ్ కూడా అంతే స్థాయిలో రచన చేసారు. కానీ తమన్ ఇచ్చిన సంగీతం కాపీ ఆరోపణలు ఎదుర్కొంటుంది. తమన్ బాలీవుడ్ లో చేసిన బేబీ జాన్ టైటిల్ సాంగ్ కూడా సేమ్ ట్యూన్ లో మ్యూజిక్ ఇచ్చాడని సోషల్ మీడియాలో కామెంట్చ్ చేస్తున్నారు. సాంగ్ వినడానికి బాగుంది తమన్ నుండి ఇంకా ఎక్కవ ఎక్స్పెట్ చేసామని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు OG ఫైర్ స్ట్రామ్ భారీ వ్యూస్ రాబాదుతూ ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది.