NTV Telugu Site icon

OG : హైప్ తో చంపేస్తారా ఏంటీ.. ఓజీలో మరో స్టార్ హీరో..?

Og

Og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ఫిల్మ్ OG. ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూట్ పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాల వలన కొన్ని నెలలు పాటు పక్కన పెట్టారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేసారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ పై DVV దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో పవన్ కళ్యాణ్ లేని సీన్స్ ను ఇటీవల చిత్రీకరించారు.

Also Read : Pushpa 2 : టాలీవుడ్ సినిమాల దెబ్బకు సైడయిన ‘ఛావా’

కాగా ఇప్పుడు ఈ OG సినిమాకు సంబంధించి సెన్సేషన్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ హై యాక్షన్ సినిమాలో మరోక స్టార్ హీరో నటిస్తున్నాడు అనేది ఈ న్యూస్ సారాంశం. ఆ హీరో వేరే ఇంకెవరో కాదురెబల్ స్టార్ ప్రభాస్.ఈ సినిమాలో కథలో ఫ్లాష్ బ్యాక్ లో ఓ క్యారక్టర్ ఉంటుందట. ఆ రోల్ కోసం ఎవరిని తీసుకోవాలి అనేక డిస్కషన్స్ తర్వాత రెబల్ స్టార్ ను సంప్రదించారట మేకర్స్. గతంలో ప్రభాస్ తో సుజీత్ సాహో ను తెరకెక్కించారు, ఆ  సాన్నిహిత్యంతో ప్రభాస్ కు కథ వినిపించగ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ప్రభాస్. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ సినీ సిర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఇటీవల ఈ సినిమాలో అకిరా నందన్ నటిస్తున్నాడు అని కూడా టాక్ నడిచింది. కానీ ఈ వార్తలపై మేకర్స్ నుండి ఎటువంటి అధికారిక  ప్రకటన రాలేదు.

Show comments