హిట్ టాక్ వస్తే సెలవులు అవసరం లేదు, ఫ్లాప్ టాక్ వస్తే సెలవులు ఉన్నా ఉపయోగం లేదు. అయితే, డివైడ్ టాక్ వచ్చిన సినిమాలకు మాత్రం హాలిడే సీజన్ ఎంతగానో దోహదం చేస్తోంది. ఇటీవలి కాలంలో విడుదలైన పెద్ద సినిమాలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన OGపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి రోజు ఎకంగా ₹154 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధిస్తూ సత్తా చాటినా, సినిమా టాక్ మాత్రం డివైడ్ అయింది. ఫ్యాన్స్‌కు పవన్‌పై ఎలివేషన్స్ బాగా నచ్చినా, సాధారణ ప్రేక్షకులకు ఇది సాధారణ గ్యాంగ్‌స్టర్ కథలాగే అనిపించింది. ఇంత భారీ ఓపెనింగ్ ఉన్నా కూడా, సెలవులు రాకపోయి ఉంటే సినిమా వసూళ్లు ఇంత స్థాయికి చేరేవి కాదన్న మాట.
Also Read : Tollywood : పెంచిన టిక్కెట్ రేట్లే సినిమాలకు శాపాలా?
అయితే దసరా సెలవులు రావడంతో, OG రెండో వారం కల్లా మళ్లీ పుంజుకుంది. 11 రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. మొదటి రోజు ₹154 కోట్లు, తర్వాత 10 రోజుల్లో మరో ₹154 కోట్లు వసూలు చేస్తూ మొత్తం ₹308 కోట్లకు చేరుకుంది. దాంతో పవన్ కల్యాణ్‌ను 200 కోట్ల క్లబ్ నుండి 300 కోట్ల క్లబ్లోకి చేర్చిన సినిమా OGగా రికార్డు సృష్టించింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరకు కూడా దసరా సీజన్ మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఈ సినిమా కూడా డివైడ్ టాక్‌తోనే మొదలైంది. కానీ, పండగ రోజుల్లో సోలో రిలీజ్ కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు తరలివచ్చారు. సినిమా బిజినెస్ ₹182 కోట్లు కాగా, వసూళ్లు ₹256 కోట్లకు చేరాయి.
Also Read : Rashmika – Rukmini : రష్మికకు చెక్ పెడుతున్న సెన్సేషనల్ హీరోయిన్..
హిట్ టాక్ ఉంటే సినిమా ఎప్పుడు వచ్చినా సూపర్ హిట్ అవుతుంది. ఫ్లాప్ టాక్ వస్తే సెలవులు ఉన్నా ఫలితం ఉండదు. అయితే డివైడ్ టాక్ ఉన్న సినిమాలకు మాత్రం సెలవులు వరంగా మారుతున్నాయి. పండగ సమయంలో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడం, సెలవు వాతావరణంలో సినిమాల మీద ఆసక్తి పెరగడం వంటివి సినిమాలకు ఊపిరి పోస్తున్నాయి. 2025 దసరా సెలవులు పవన్ కల్యాణ్ OGకి వరమై మారాయి. “సంక్రాంతికి వస్తున్నాం” 303 కోట్ల గ్రాస్ రికార్డును బ్రేక్ చేస్తూ, ఈ ఏడాది టాప్ గ్రాసర్‌గా OG దూసుకుపోయింది. సెలవులు, పవన్ మాస్ ఇమేజ్, భారీ స్కేల్ స్క్రీన్ ప్రెజెన్స్ – ఈ మూడు కలయికే OG విజయానికి మూల కారణమైంది. సెలవులు సినిమాకు బూస్ట్ ఇవ్వవచ్చు కానీ, టాక్ నే తుదితీర్పు. హిట్ టాక్ వస్తే హాలిడేస్ అవసరం లేదు. ఫ్లాప్ టాక్ వస్తే సెలవులు కూడా రక్షించలేవు. కానీ డివైడ్ టాక్ సినిమాలకు మాత్రం పండగ సీజన్ చక్కగా కలిసి వస్తోంది. దేవర (2024 దసరా) – OG (2025 దసరా) విజయాలు అదే నిరూపిస్తున్నాయి!