Site icon NTV Telugu

Official Update : రోరింగ్‌ లయన్‌తో అనిల్‌ సినిమా.. అధికారిక ప్రకటన..

Nbk108

Nbk108

రోరింగ్‌ లయన్‌ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన సినిమాల నుంచి టీజర్లు, పోస్టర్‌ విడుదలై నెట్టింట్లో హంగామా చేస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఎఫ్‌3 డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించబోతున్నారని చిత్రసీమలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే నేడు బాలయ్య బర్త్‌డే సందర్శంగా ఆ వార్తను నిజం చేస్తూ.. బాలకృష్ణ 108వ సినిమా బిగ్‌ అప్డేట్‌ను విడుదల చేశారు. ఇటీవల ఎఫ్‌ 3 సినిమాతో హిట్‌ కొట్టి ఊపుమీదున్న అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమాపై అభిమానుల్లో అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. అయితే.. ఈ రోజు బాలకృష్ణ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అనిల్.. తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు.

‘‘గాడ్ ఆఫ్ మాసెస్, రోరింగ్ లయన్ నందమూరి బాలకృష్ణ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన 108వ సినిమాను డైరెక్ట్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా, గౌరవంగా ఉంది. ఈ సారి వచ్చే బ్యాంగ్ మామూలుగా ఉండదు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. దీంతో పాటు బాలయ్యతో దిగిన ఫొటోను అనిల్‌ షేర్‌ చేశారు. కాగా, బాలయ్య 107వ సినిమా టీజర్ నిన్ననే విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా 108వ సినిమా అప్ డేట్ తో బాలయ్య అభిమానులకు సందడి నెలకొంది.

Exit mobile version