NTRNEEL : నందమూరి ఫ్యాన్స్‌కు మిడ్ నైట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండే అటు నందమూరి అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి చిత్రాలతో మాస్ పల్స్ పట్టుకున్న నీల్, ఎన్టీఆర్‌ను ఏ రేంజ్లో చూపిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో అభిమానుల కోసం ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్ను మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ‘ఫస్ట్ గ్లింప్స్’ను మే 19 అర్ధరాత్రి విడుదల చేయబోతున్నారు. పుట్టినరోజు వేడుకలను ఒక రోజు ముందుగానే ప్రారంభించేలా అర్ధరాత్రి నుండే సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్ ద్వారా భారీ హైప్ క్రియేట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ లుక్ తో పాటు డ్రాగన్ టైటిల్‌ను అఫీషియల్ గా ప్రకటించనున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రం 2027 జూన్ 11న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ గ్లింప్స్‌తోనే సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో తన బాక్సాఫీస్ సత్తా చాటుతారని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!