Site icon NTV Telugu

NTR Neel: ఆ ఊరిలో ఎన్టీఆర్ – నీల్ షూట్

Ntrneel

Ntrneel

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది, కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నిజానికి, ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తారని అనుకున్నారు, కానీ ఈ రోజు మధ్యాహ్నం అలా చేయడం కుదరదని, జూన్ 25వ తేదీ 2026న రిలీజ్ చేస్తామని సినిమా టీం ప్రకటించింది.

Nani : సల్మాన్ ఖాన్ పై నాని సంచలన కామెంట్స్

ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ మంగళూరు బెల్ట్‌లోని కుంట అనే గ్రామంలో జరుగుతోంది. ఈ గ్రామంలో రెండు వాటర్‌ఫాల్స్ ఉన్నాయి: విభూది మరియు వజ్రగుండి. ఈ ఊరిలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారని సమాచారం.

Akhanda 2: గౌతమీపుత్ర లొకేషన్స్‌కి అఖండ 2

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమా టీం కూడా షూటింగ్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

Exit mobile version