కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ని అనుకుంటున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా గత నెలలోనే మొదటి షెడ్యూల్‌ను ఫినిష్ చేసింది టీం. ఆ తర్వాత కొన్ని రోజులు సమ్మర్ వెకేషన్ అన్నట్టుగా గ్యాప్ ఇచ్చారు. మళ్లీ రీసెంట్‌గానే రెండో షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారని తెలుస్తోంది. ఇంత వరకు నీల్ తన హీరోయిన్ల గురించి అప్డేట్ ఇవ్వలేదు. కానీ ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ అని టాక్ అయితే గట్టిగా వినపడుతుంది. కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలతో ప్రపంజ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్, తారక్ ని ఎలా చూపిస్తాడా అని అభిమానులు ఈ మూవీపై చాలా అంచానాలైతే పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి సినీ సర్కిల్స్‌లో మరో కొత్త వార్త చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే, అయితే ఈ సాంగ్‌లో రష్మిక కనిపించే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఈ సాంగ్‌లో యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న బ్యూటీ కేతికా శర్మను తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘సింగిల్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కేతిక, ‘రాబిన్ హుడ్’ మూవీలో ‘అది ధ సర్ప్రైజ్..’ అనే సాంగ్ తో యూత్ లో మంచి ఫేమ్ సంపాదించుకుంది. నిజంగానే ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేస్తే అది ఆమెకు బాగా కలిసొస్తుందని అభిమానులు అంటున్నారు. మరి నిజంగానే ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో స్పెషల్ సాంగ్‌లో కేతిక సర్‌ప్రైజ్ చేస్తుందా అనేది చూడాలి.