NTR Dragon: ‘ధురంధర్’ ఫార్ములాను ఫాలో అవుతున్న ఎన్టీఆర్ ‘డ్రాగన్’!

Ntr Dragon

Ntr Dragon

NTR Dragon: యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ, నిజానికి ఈ ఏడాది జూన్‌లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా రిలీజ్ 2027 జూన్ 11కి వాయిదా పడింది. అయితే, ఈ లేట్ అవ్వడానికి కారణం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వేసిన ఒక కొత్త ప్లాన్ అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ‘డ్రాగన్’ గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు ఇది రెండు పార్టులుగా వస్తుందని మేకర్స్ ఎక్కడా అఫీషియల్‌గా చెప్పలేదు. కానీ, కథ నిడివి ఎక్కువగా ఉండటంతో ప్రశాంత్ నీల్ దీనిని రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారట. ఇందుకోసం ఆయన డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’ ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య ధర్ ‘ధురంధర్’, ‘ధురంధర్ 2’ సినిమాల షూటింగ్‌ను ఒకేసారి పూర్తి చేసి, కేవలం మూడు నెలల గ్యాప్‌లోనే వాటిని థియేటర్లలోకి తీసుకొచ్చారు.

సరిగ్గా ఇదే రూట్‌లో ప్రశాంత్ నీల్ కూడా ‘డ్రాగన్’ సినిమాను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఒక పార్ట్ రిలీజ్ అయ్యాక రెండో పార్ట్ షూటింగ్ మొదలుపెడితే, గతంలో ‘కేజీఎఫ్ 3’ లేదా ‘సలార్ 2’ లాగా సీక్వెల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో తెలియని పరిస్థితి వస్తుంది. అందుకే, ముందే రెండు పార్టుల షూటింగ్‌ను ఒకేసారి కంప్లీట్ చేసి, 2027 జూన్ 11న ఫస్ట్ పార్ట్‌ను, ఆ తర్వాత కేవలం ఆరు నెలల గ్యాప్‌లోనే అంటే 2027 డిసెంబర్‌లో సెకండ్ పార్ట్‌ను రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ‘డ్రాగన్’ సినిమాలో ఎన్టీఆర్ ఒక ఆఫ్ఘనిస్తానీ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ రోల్ కోసం తారక్ గుర్తుపట్టలేనంతగా పూర్తిగా మేకోవర్ అయ్యారు; చాలా బక్కచిక్కిపోయిన లుక్‌తో కనిపిస్తున్నారు. ఇంతటి స్పెషల్ మేకోవర్ కావడంతో, మళ్లీ మళ్లీ ఇదే గెటప్‌లోకి రావడం కష్టమనే ఉద్దేశంతోనే తారక్ కూడా రెండు పార్టులను ఒకేసారి పూర్తి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

మరోవైపు, రీసెంట్‌గా ఎన్టీఆర్ – డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఒక సినిమా అఫీషియల్‌గా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సెంటిమెంట్ ఉన్న అనిల్ రావిపూడి, తారక్ సినిమాను 2028 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, ‘డ్రాగన్’ రెండు పార్టుల పనులు పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్, అనిల్ రావిపూడి సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ లెక్కన చూస్తే, ఎన్టీఆర్ – అనిల్ రావిపూడి మూవీ 2028 సంక్రాంతికి కాకుండా, 2028 సమ్మర్‌లో ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.