జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించిన ‘వార్ 2’ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మరో ముఖ్య పాత్రలో నటించారు. అయితే, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read:Coolie : అమీర్ ఖాన్, నాగార్జునను డామినేట్ చేసిన చిన్న నటుడు..
అప్పట్లో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆయన “రెండు కాలర్లు ఎత్తి సినిమా చూశాక అభిమానులు ఇలా ఎగరేసుకుంటారు,” అంటూ కామెంట్ చేశారు. అయితే, ఇప్పుడు అభిమానులు “రెండు కాలర్లు కాదు కదా, ఒక కాలర్ ఎగరేసుకునేలా కూడా సినిమా లేదు,” అని స్వయంగా కామెంట్ చేస్తున్నారు. “జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు బాలీవుడ్‌కు వెళ్లి ఇలాంటి సినిమా చేశాడా,” అని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
Also Read:JR NTR – Vijay Devarakonda : జూనియర్ ఎన్టీఆర్, విజయ్ లకు వాటితో భారీ దెబ్బ..!
అయితే, ఇదే క్రమంలో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఎప్పుడెప్పుడు ఇలా కాలర్ ఎగరేసాడు, ఆయా సినిమాల పరిస్థితి ఏమిటి అనేది కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దాని ప్రకారం, ఇంతకుముందు కళ్యాణ్ రామ్ నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా విషయంలో కూడా ఇలాగే ఎన్టీఆర్ మాట్లాడారు. “నేను సినిమా చూశాను, మీరందరూ కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని,” ఆయన కామెంట్ చేశారు. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
అయితే, ఇప్పుడు ‘దేవర’ సినిమా గురించి కూడా ప్రస్తావిస్తున్నారు.
‘దేవర’ సినిమా విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇలాగే కాలర్ ఎగరేసారని, ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది అని అంటున్నారు. ‘దేవర’ ఇప్పటికీ హిట్టే అని చెబుతారు కానీ, నెంబర్స్ కొన్ని ఫ్యాబ్రికేట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కు కాలర్ ఎగరేసే సెంటిమెంట్ కలిసి రాలేదని, ‘దేవర’ సంగతి పక్కన పెడితే, ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ తర్వాత ‘వార్ 2’ రెండవ దెబ్బ అని, ఇక మీదట ఆ కాలర్ జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే, ఇదంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో కొంతమంది కొట్టిపారేస్తున్నారు. కావాలని తమ హీరో మీద నెగటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఇలా మాట్లాడుతూ ఉండవచ్చు అని కూడా వారు అభిప్రాయపడుతున్నారు.
