షూటింగ్ ప్రారంభించిన నాగశౌర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య తాజాగా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ఇరా క్రియేషన్స్ బ్యానర్‌లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య 22వ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని “ఎన్ఎస్22” పేరుతో పిలుస్తున్నారు. అయితే కరోనా తరువాత సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించామని ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో నాగశౌర్య, ఆయన తల్లి ఉషా ముల్పూరి, హీరోయిన్, దర్శకుడు ఉన్నారు. హైదరాబాద్ లో సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ను నేడు ప్రారంభించారు.
Read Also : “వాలిమై” యూరప్ ట్రిప్ ?
Also Read
ఈ చిత్రంలో నాగశౌర్య సరసన షిర్లీ సెటియా హీరోయిన్ గా నటిస్తోంది. మనసులను హత్తుకునే అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో సీనియర్ నటి రాధికా ఓ కీలకమైన పాత్రలో కన్పించబోతోంది. ఈ చిత్రాన్ని ఉషా ముల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పురి దీనిని సమర్పించారు. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో నాగశౌర్య నటిస్తున్న మూడవ చిత్రమిది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో “వరుడు కావలెను” అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో, “లక్ష్య” అనే స్పోర్ట్స్ డ్రామాతో బిజీగా ఉన్నాడు.
- Tags
తాజావార్తలు
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?