“వాలిమై” యూరప్ ట్రిప్ ?

తల అజిత్ కుమార్ “వాలిమై” ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ నెట్టింట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అందులో ఈ సినిమాను 2021లోనే విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సినిమా షూటింగ్ ను వేగవంతం చేశారు. అజిత్ నిన్న హైదరాబాద్‌లో ప్యాచ్ వర్క్ షూటింగ్ పూర్తి చేశాడు. మీడియా కథనాల ప్రకారం అజిత్, దర్శకుడు హెచ్ వినోద్, మరికొందరు ప్రధాన తారాగణం, సిబ్బంది గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న ప్యాచ్ వర్క్ పూర్తి చేసి ఈరోజే తిరిగి చెన్నైకి వెళ్లనున్నారు.

Read Also : అఫిషియల్ : “రాక్షసుడు” సీక్వెల్ వచ్చేస్తోంది !

సినిమాలోని కీలక యాక్షన్ సీక్వెన్స్ ను పూర్తి చేయడానికి రాబోయే 10 రోజుల్లో తూర్పు యూరప్ వెళ్లనున్నారట చిత్రబృందం. ఈ షెడ్యూల్ 7 రోజులు సాగనుందట. ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ కూడా ఈ షెడ్యూల్‌లో భాగం కానున్నారు. మహమ్మారి కారణంగా చిత్రం యూరోపియన్ షెడ్యూల్ దాదాపు ఒక సంవత్సరం ఆలస్యం అయ్యింది. కానీ ఇప్పుడు మూవీ టీం అక్కడకు వెళ్ళడానికి శరవేగంగా సన్నాహాలు చేసుకుంటోంది. ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న యువన్ శంకర్ రాజా ఇప్పటికే రికార్డింగ్ పనులను ప్రారంభించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-