Site icon NTV Telugu

Anil Ravipudi : పవన్ కళ్యాణ్ తో కాదు.. అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమా ఫిక్స్.

Ram Anil Ravipudi

Ram Anil Ravipudi

వరుస ప్లాపులు రావడంతో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ స్క్రిప్ట్ విషయంలో దర్శకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాంబినేషన్స్ పై కాకుండా కథలపైనే ద్రుష్టి పెడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే కేవలం ఒక్క సినిమాను డైరెక్ట్ చేసిన మహేశ్ బాబు పి డైరెక్షన్ లో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరక్కుతున్న ఈ సినిమా నవంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయింది.

Also Read : Tollywood : నవంబర్ ఫస్ట్ హాఫ్ లో హిట్టుకొట్టెదెవరు..?

ఈ నేపధ్యంలో నెక్ట్స్ సినిమాపై ఫోకస్ పెట్టాడు రామ్. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు హరీష్ శంకర్ ఓ కథ చెప్పాడు ఆల్మోస్ట్ ఒకే అయిందని టాక్ కూడా వినిపించింది. కానీ అది సెట్ అవలేదు. అలాగే మరో ఇద్దరు టాలీవుడ్ దర్శకులు కూడా రామ్ కు కథ వినిపంచగా ఏవి సెట్ అవలేదు. అయితే వీరెవరూ కాకుండా టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో రామ్ సినిమా ఓకే అయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రామ్ పోతినేని హీరోగా సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా ఓకే అయింది. వాస్తవానికి రామ్ పోతినేని – అనిల్ రావిపూడి కాంబోలో సినిమా ఎప్పుడో రావాల్సింది. మాస్ మహారాజ హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాలో మొదటి అనుకున్న హీరో రామ్ పోతినేని. కానీ వేర్ ఇతర కారణాల వలన రామ్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఇన్నేళ్లకు మళ్ళి రామ్ – అనిల్ రావిపూడి కలిసి సినిమా చేయబోతున్నారు. SVC బ్యానర్ లో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Exit mobile version