Committee Kurrollu : కమిటీ కుర్రోళ్ళు కాదు కలెక్షన్స్ కుర్రోళ్ళు..
- లాభాల పంట పండిస్తున్న కమిటీ కుర్రోళ్లు
- మూడో వారంలో అడుగుపెట్టిన కమిటీ కుర్రోళ్ళు
- ఇప్పటికి డీసెంట్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న కుర్రోళ్ళు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిఫరెంట్ కంటెంట్ చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందని తెలుగు ప్రేక్షకులు మరోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆడియెన్స్, విమర్శకులతో పాటు సినీ సెలబ్రిటీ నుంచి అభినందనలు అందుకుంటూ సినిమా బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. ఇప్పటికే సినిమా అన్నీ ఏరియాస్‌లో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలోకి పయనిస్తోంది.
Also Read: Nani: నేచురల్ స్టార్ ఫ్యాన్స్ ను భయపెడుతున్న శనివారం ‘రన్ టైమ్’.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలనే డైలాగ్ తరహాలో మంచి కథతో చేసిన సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో నిహారిక అండ్ టీమ్ కమిటీ కుర్రోళ్ళు సినిమాను ప్రమోట్ చేస్తూ వచ్చింది. రోజు రోజుకీ ఆదరణతో పాటు బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను కూడా పెంచుకోవటంలో కమిటీ కుర్రోళ్ళు సక్సెస్ అయ్యారు. సినిమా విజయవంతంగా మూడో వారంలోకి అడుగు పెట్టేసింది. రెండో వారం కంటే మూడో వారంలో సినిమా ప్రేక్షకాదరణ పొందుతుండటం విశేషం. ఇప్పటివరకు ఈ చిత్రం రూ. 17.76 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకుంటోందీ చిత్రం. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ దక్కించుకుంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!