లాక్ డౌన్ వల్ల మనలాగే సెలబ్రిటీలు కూడా బలవంతంగా ఇంటిపట్టున ఉండిపోతున్నారు. అయితే, ఊరికే ఓ మూలన కూర్చుంటే ఎలా? లైఫ్ బోర్ గా అనిపిస్తుంది కదా! అందుకే, నోరా తన నోరూరించే అందాలతో ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందించింది. అయితే, ‘మీరూ డ్యాన్స్ చేయండి! ఉత్సాహంగా ఉండండి!’ అంటూ ఛాలెంజ్ కూడా విసిరింది ఛలాకీ పిల్ల! నోరా ఫతేహి డ్యాన్స్ మూవ్ మెంట్స్ గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏముంటుంది చెప్పండి! ఈసారి కూడా మన మనోహరి మాయ చేసింది. పొట్టి నిక్కర్ వేసుకుని, వైట్ టాప్ తో వయ్యారంగా ఊగిపోయింది. అయితే, ఆమెతో పాటూ కొరియోగ్రాఫర్ కూడా ఈ ఇన్ స్టాగ్రామ్ వీడియోలో కనిపించాడు. ఆయనే నోరాకి ‘కరీబ్’ సాంగ్ కి సంబంధించిన హుక్ స్టెప్ నేర్పించాడట. ఇంకేముంది ‘దిల్బర్’ బ్యూటీ దిష్టి తగిలేంత అందంగా డ్యాన్స్ చేస్తూ నెటిజన్స్ కూడా ఛాలెంజ్ విసిరింది. లాక్ డౌన్ వేళ నీరసంగా కూర్చోవద్దని, తనలా ఆడిపాడుతూ దుమ్మురేపాలని పిలుపునిచ్చింది. చూడాలి మరి, నోరా సవాల్ ను స్వీకరించి ఎంత మంది కాళ్లు, చేతులు కదుపుతారో!
A post shared by Nora Fatehi (@norafatehi)