Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Niu Lai Box Office: సినిమా సక్సెస్ కావాలంటే భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, కోట్లాది రూపాయల ప్రమోషన్స్ అవసరం లేదని ఓ చైనీస్ యానిమేషన్ చిత్రం నిరూపిస్తోంది. కేవలం పరిమిత వనరులతో తెరకెక్కిన ‘నియు లాయ్’ (Niu Lai) ప్రస్తుతం చైనా బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన విజయాన్ని అందుకుంటోంది. ఎలాంటి ప్రచారం లేకుండానే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చిన్న సినిమా మిలియన్ డాలర్ల వసూళ్ల దిశగా దూసుకెళ్లింది. ‘నియు లాయ్’ ఆగస్టు 5న చైనాలో థియేటర్లలో విడుదలైంది. మొదట్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. విడుదలైన తొలి పది రోజుల్లో కేవలం 10 వేల యువాన్లు (సుమారు 1,400 డాలర్లు) మాత్రమే వసూలు చేసినట్లు స్థానిక బాక్సాఫీస్ గణాంకాలు వెల్లడించాయి. కొన్ని రోజుల్లో అయితే రోజువారీ కలెక్షన్లు కేవలం 200 యువాన్లకు పరిమితమైనట్లు సమాచారం. అయితే ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమాలోని యానిమేషన్ నాణ్యత, విచిత్రమైన విజువల్స్, కథనంపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్లు, విమర్శలు సినిమాకు ఊహించని ప్రచారాన్ని తెచ్చిపెట్టాయి.
సినిమాకు సంబంధించిన క్లిప్స్, మీమ్స్, ప్రేక్షకుల రియాక్షన్స్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యాయి. దీంతో అసలు సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఫలితంగా థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టడంతో బాక్సాఫీస్ వసూళ్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. రాయిటర్స్ నివేదికల ప్రకారం.. ఆగస్టు 20 నాటికి ‘నియు లాయ్’ చైనా బాక్సాఫీస్ వద్ద 4 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. అంతేకాదు.. రోజువారీ బాక్సాఫీస్ ర్యాంకింగ్స్‌లో హాలీవుడ్ చిత్రం ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ తర్వాతి స్థానంలో నిలవడం విశేషంగా మారింది. అయితే ‘నియు లాయ్’ నిర్మాణ వ్యయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొన్ని నివేదికల ప్రకారం ఈ సినిమా బడ్జెట్ కేవలం 200 డాలర్లు మాత్రమేనని ప్రచారం జరుగుతోంది. అయితే మరికొన్ని కథనాల్లో నిర్మాణానికి కొన్ని వేల డాలర్లు ఖర్చయినట్లు పేర్కొంటున్నారు. దీంతో 200 డాలర్ల బడ్జెట్ అనే సంఖ్యను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అమేచ్యూర్ యానిమేటర్ షిన్ యుమెంగ్, ఆయన తల్లి సన్ లిఫాంగ్ కలిసి సుమారు ఐదేళ్లపాటు ఈ సినిమాను రూపొందించినట్లు సమాచారం. భారీ స్టూడియో, స్టార్ హీరోలు, కోట్లాది రూపాయల బడ్జెట్ లేకుండానే ‘నియు లాయ్’ సాధిస్తున్న విజయం ఇప్పుడు చైనా సినీ పరిశ్రమలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. భారీ బడ్జెట్ కాదు, ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే కంటెంట్ ఉంటే చిన్న సినిమా కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేయగలదని ‘నియు లాయ్’ మరోసారి నిరూపిస్తోంది.
Also Read
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు