Site icon NTV Telugu

Nithiin – Vaitla : నితిన్ – శ్రీను వైట్ల.. అవన్నీ ఫేక్..

Nithiin Sirnuvaitla

Nithiin Sirnuvaitla

టాలీవుడ్ ఇటీవల ఓ వార్త హల్ చల్ చేసింది. యంగ్ హీరో నితిన్ హీరోగా శ్రీనువైట్ల కాంబోలో సినిమా వస్తోందనేది ఆ వార్త సారాంశం.  2016 నుండి  2025 వరకు 11 సినిమాలలో కేవలం ఒకే ఒక హిట్ హిట్టైన నితిన్ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. రీసెంట గా రాబిన్ హుడ్ నితిన్ కెరీర్ లో భారీ నష్టాలు తెచ్చిన సినిమాగా నిలవగా తమ్ముడు అల్ట్రా డిజాస్టర్ గా నిలిచింది. అంతటి భారీ డిజాస్టర్స్ అందుకున్న నితిన్ నెక్ట్స్ విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో చేయబోయే సినిమాతో పాటు బలగం వేణుతో చేయబోయే సినిమా కూడా ఆగింది.

Also Read : Tollywood : సెప్టెంబర్ 19న చిన్న సినిమాల జాతర

ఇక మహేశ్ బాబు ఆగడు తో మొదలైన శ్రీనువైట్ల ప్లాపుల పరంపర గతేడాది వచ్చిన విశ్వంతో కూడా ఆగలేదు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ సినిమాలు ఇస్తూ వస్తున్నాడు శ్రీనువైట్ల. అయితే తాజాగా నితిన్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడని, మైత్రి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది టాక్ వినిపించింది. శ్రీను వైట్ల కథ కాకుండా సమజవరాగమనకు పనిచేసిన నందు కథతో ఈ సినిమా చేస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలు నిజం కావని అసలు నితిన్, శ్రీను వైట్ల కాంబోలో సినిమానే లేదని తెలిసింది. నితిన్ ప్రస్తుతం గ్యాప్ తీసుకున్నాడని శ్రీనువైట్లతో సినిమా అనేది ఫేక్ అని హీరో సైడ్ నుండి సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా మైత్రీ మూవీస్ లో మాత్రం శ్రీ‌నువైట్ల ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమాలో హీరో నితిన్ కాదట. మరి శ్రీనువైట్ల ఈ సినిమాను ఎవరితో చేస్తాడో చూడాలి.

Exit mobile version