Ramayana: ఊపిరి పీల్చుకున్న రామాయణ టీమ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెండితెరపై ఎన్నో సార్లు దృశ్యరూపం దాల్చాల్సిన ఇతిహాసం రామాయణం మరోసారి రిలీజ్‌కు సిద్ధమైంది. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ’ రూపొందింది. సినిమా ట్రైలర్‌ను బ్రహ్మ ముహూర్తంలో రిలీజ్ చేశారు. పాన్ వరల్డ్‌గా రిలీజ్ అవుతున్న ‘రామాయణం’ ప్రపంచవ్యాప్తంగా 40 భాషల్లో డబ్ కావడం విశేషం. బాలీవుడే కాదు ఇండియన్ సినీ లవర్స్‌ను ‘రామాయణం’ చాలా కాలంగా ఊరిస్తోంది. ఒక్కో పార్ట్ పై 2000 కోట్లు ఖర్చు పెట్టారని, రెండు పార్ట్‌ల బడ్జెట్ 4000 కోట్లు అంటూ హైప్ క్రియేట్ చేశారు. విఎఫ్ఎక్స్ విజువల్స్ సినిమా నిండా పరిచినా ఇంత ఖర్చు అవుతుందా అన్న డౌట్ కు ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. విజువల్ వండర్ గా తీశాడు దర్శకుడు నితీష్ తివారీ.
రామాయణం నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమా పై అంచనాలను తగ్గించేసింది. రామాయణం తెలిసిన సగటు ప్రేక్షకులు ఎంతో ఊహించుకోగా ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ కాలేకపోయింది. ఇలా నిరాశపరిచిన సినీ లవర్స్‌కు ట్రైలర్ ఊపిరిపోసింది. రావణాసురుడిగా నటించిన యష్ సీన్స్ తో మొదలైన ట్రైలర్ హైప్ తీసుకొచ్చింది. రాముడిగా రణ్‌బీర్ అందగాడిగా, సౌమ్యుడిగా కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. సీతగా నటించిన సాయి పల్లవి బాగుందని కొందరు అంటుంటే, చిన్న పిల్లగా ఉందని, ఓన్ వాయిస్ కాకుండా డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Also Read
రామాయణంలో అందరూ ఎదురుచూసే హనుమాన్ను నాలుగు నిమిషాల ట్రైలర్లో చూపించకపోవడం షాక్ ఇచ్చింది. సినిమాకు హన్స్ జిమ్మర్తో పాటు ఏ.ఆర్. రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చారు. విజువల్స్‌ను ఎలివేట్ చేసేలా మ్యూజిక్ ఉంది. కొన్ని యాక్షన్ సీన్స్, విఎఫ్ఎక్స్లో జంతువులను చూస్తుంటే ‘ఆదిపురుష్’ గుర్తు చేసినా, ఓవరాల్‌గా ఆకట్టుకున్నాడు దర్శకుడు. రిలీజ్ డేట్ ఇవ్వకపోయినా దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
తాజావార్తలు
-
Ramayana : సీతగా సాయి పల్లవి కన్నా అందంగా శూర్పణఖ రకుల్ ప్రీత్ సింగ్.. అసలు నిజం ఇదా?
-
Central Cabinet Decision: సముద్ర మంథన్ ప్రాజెక్ట్ ఆమోదం.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
Ramayana: ఊపిరి పీల్చుకున్న రామాయణ టీమ్?
-
Srisailam Dam: శ్రీశైలం వైపు దూసుకొస్తున్న కృష్ణమ్మ.. వారంలో గేట్లు ఎత్తే అవకాశం.!
-
IPL 2027: CSKకు కోలుకోలేని దెబ్బ.. ఒకేసారి మూడు జట్లకు రాజీనామా.. అతడికే జట్టు బాధ్యతలు..
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!