Site icon NTV Telugu

Naga Babu: నిహారిక విడాకులు.. మేం చేసిన తప్పే!

Niharika

Niharika

మెగా డాటర్ నిహారిక చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సుమారు మూడు ఏళ్ల తర్వాత వీరిద్దరూ మనస్పర్ధలతో మ్యూచువల్ డైవర్స్ తీసుకుని విడిపోయారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయం మీద నాగబాబు నోరు విప్పారు. నిజానికి నిహారికతో తాను అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాను అని చెప్పుకొచ్చారు. కానీ వాళ్ల పర్సనల్ విషయాలు ఎప్పుడూ అడిగే వాడిని కాదు. నిజానికి వాళ్ళు నిర్మాతలుగా లేదా హీరోలుగా అక్కడ సక్సెస్ కొడుతున్నారా లేదా అనేది నేను చూడను. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారనేదే నాకు ముఖ్యం.

Also Read:Aakasam Lo Oka Tara: దుల్కర్.. టాలీవుడ్ హీరో అయిపోతాడేమో ఇక!

నిజానికి వరుణ్ తేజ్ వచ్చి లావణ్య త్రిపాఠిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని అడిగితే ఆమెతో హ్యాపీగా ఉండగలను అనుకుంటున్నావా? ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బందులు వస్తే ఏం చేస్తావ్ అని అడిగాను. అయితే కచ్చితంగా ఆమెతో హ్యాపీగా ఉంటాను ఎలాంటి ఇబ్బందులు వచ్చినా చూసుకోగలనని నమ్మకం ఉందంటే వెంటనే పెళ్లి చేశాను. వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉన్నారు. కాకపోతే నిహారిక విషయంలో మాత్రం పూర్తిగా భిన్నంగా జరిగింది.

Also Read:Etala Rajender: ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేసిన ఎంపీ ఈటల రాజేందర్..

నేను పరిస్థితిని అంచనా వేయలేక పోయాను. అది మా తరఫునుంచి జరిగిన తప్పే. మేము దాన్ని సరిగా అంచనా వేయలేకపోయాము. ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోమని మేము చెప్పలేదు, ప్రపోజల్ వచ్చింది దానికి ఆమె ఒప్పుకుంది, ఆమె ఇష్టమే కదా అని పెళ్లి చేశాం. కానీ ఇద్దరి వేవ్ లెంత్ కుదరలేదు, విడిపోవాలని అనుకున్నారు, విడిపోయారు. కలిసి ఉండమని కూడా నేను బలవంతం చేయలేదు. వాళ్లకు కలిసి ఉండలేం అనిపించింది, ఎవరు దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతానికి ఆమె సినిమా నిర్మాణం మీద ఫోకస్ పెట్టింది అని నాగబాబు చెప్పుకొచ్చాడు.

Exit mobile version