Nidhi Agrawal: వీరమల్లు ల్లో ఎన్నో సర్ప్రైజ్లు దాగి ఉన్నాయి: నిధి అగర్వాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. ఈ మూవీ ఎప్పుడో మొదలైనప్పటికి పవన్ పొలిటికల్ బిజీ కారణంగా ఆలస్యం అవుతూ వస్తుంది. ఇక క్రిష్ జాగర్లమూడి, ఏఎం రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రజంట్ శరవేగంగా జరుగుతుంది. యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొల్లగొట్టినాదిరో అంటూ సాగే ఈ పాట రొమాంటిక్‌గా ఉంటుందని రిలీజ్ చేసిన పోస్టర్‌ను బట్టి అర్థమవుతుంది. కాగా ఈ వీరమల్లు సెకండ్ సాంగ్ ఫిబ్రవరి 24న రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే పలుమార్లు ఈ మూవీ గురించి మాట్లాడిన నిధి.. తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిర్వహించిన ట్విట్టర్ స్పేస్ లో పాల్గొని సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.
Also Read:Manchu Manoj: మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు..!
Also Read
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. ‘ ‘హరిహర వీరమల్లు’ టీజర్లో మీరు చూసింది శాంపిల్ మాత్రమే, సినిమాలో ఎన్నో సర్ప్రైజ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు సినిమా నుంచి దేన్నీ పెద్దగా రివీల్ చేయలేదు, మీరు ఊహించని ఎన్నో ట్విస్టులుంటాయి. కథ ఎక్కడా సాగదీసినట్టు అనిపించదు. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది.ఈ మూవీలో ఓరంగజేబు ట్రాక్ కొంచెమే ఉంటుంది. మొత్తం సినిమా దాని గురించి కాదు. ఇందులో నా పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పంచమిగా చేసిన నా పాత్ర ఇప్పటివరకు చేసిన అన్ని పాత్రల్లో ది బెస్ట్. పవన్ కళ్యాణ్ నటనను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎంట్రీ ఇవ్వగానే కేవలం కొద్ది నిమిషాల్లోనే ఆయన సీన్ కోసం రెడీ అయిపోవడం చూసి షాక్ అయ్యా. ఈ కొల్లగొట్టినాదిరో సాంగ్‌ను చాలా భారీ సెట్లో తెరకెక్కించారు.ఫ్యాన్స్ కు మాస్ ఎలిమెంట్స్ కొదువే ఉండదు. ఇంతకంటే సినిమా గురించి ఎక్కువ మాట్లాడకూడదు’ అని చెప్పకనే చాలా విషయాలు చెప్పింది నిధి. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!