Site icon NTV Telugu

Nidhhi Agerwal: అగర్వాల్స్ ఏం తింటే ఇంత అందంగా ఉంటారో తెలుసా ?

Nidhiagerwal

Nidhiagerwal

హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన నిధి అగర్వాల్ టాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది. ‘సవ్యసాచి’ సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఆమె, తర్వాత ‘మిస్టర్ మజ్ను’ మరియు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలతో హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె రెండు బడా ప్రాజెక్టులలో భాగమైంది. పవన్ కళ్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాలో పంచమి అనే పాత్రలో నటిస్తోంది.

Also Read:Supritha: అమెరికాలో సుప్రీత.. “ఎంత ముద్దుగున్నావే”!

అలాగే, ప్రభాస్ సరసన ‘రాజసభ’ సినిమాలో కూడా నటిస్తోంది. ‘హరిహర వీరమల్లు’ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో, ఆమె తాజాగా ‘ఆస్క్ నిధి’ అనే ట్విట్టర్ ఫ్యాన్ ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ క్రమంలో ఒక నెటిజన్, “అసలు అగర్వాల్స్ ఏం తింటారండీ బాబు? ఒక ఆర్తి అగర్వాల్ ఇంత అందంగా ఉంటారు ఏంటి?” అని అడిగితే, దానికి ఆమె వెటకారంగా సమాధానం ఇచ్చింది. “నెయ్యితో అన్నం, పప్పు, అలాగే పచ్చడి తింటాను” అంటూ కామెంట్ చేసింది.

Also Read:NBK111: బాలయ్య్య రెండో వైపు చూపిస్తారట!

అంతేకాకుండా, ఈ సినిమాలో నటించడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ గురించి, “ఒక మాటలో ఆయన గురించి ఏమీ చెప్పలేను, నేను ఆయనకు కళ్ళతో ఫ్యాన్” అని అన్నారు. అలాగే, ప్రభాస్ గురించి, “ప్రభాస్ ట్రూ డార్లింగ్, కైండ్, రియల్ టాలెంటెడ్, హంబుల్, అద్భుతమైన వ్యక్తి” అంటూ ప్రశంసలు కురిపించింది.

Exit mobile version