Site icon NTV Telugu

Bollywood : స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు..

Bollywood

Bollywood

కరీనా కపూర్ ఇచ్చిన ఇన్ఫిరేషన్‌తో బాలీవుడ్ ముద్దుగుమ్మలు మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంటరవ్వడమే కాదు మదర్‌ ఫేజ్‌లోకి ఎంటరౌతున్నారు. ఒకప్పుడు పెళ్లై పిల్లలుంటే కెరీర్ ఖతం అన్న రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. అటు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడంలో సక్సీడ్ అవుతున్నారు. ఇప్పటికే బీటౌన్ స్టార్ బ్యూటీస్ ప్రియాంక చోప్రా, ఆలియా భట్, దీపికా పదుకొణే కెరీర్ పీక్స్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టి బేబీలకు జన్మనిచ్చారు. అనుష్క శర్మ కోహ్లీకి ఇద్దరు బిడ్డల్ని బహుమతిగా ఇచ్చింది. రీసెంట్లీ ఈ ఫేజ్‌లోకి ఎంటరయ్యింది గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ. ఇక వీళ్లంతా మదర్స్‌గా ప్రమోషన్స్ తీసుకోవడంతో చూపంతా కత్రినాపైనే పడింది.

Also Read : OGFirstSingleBlast : OG ఫస్ట్ సింగిల్ మిశ్రమ స్పందన

ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అని ఎనౌన్స్ చేసినా తిప్పి తిప్పి కత్రినా వైపుగా డిస్కర్షన్ షురూ అవుతోంది. 2021లో విక్కీతో మూడు ముళ్లు వేయించుకున్న నాటి నుండి క్యాట్ – విక్కీ జంట ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కానీ మిగిలిన హీరోయిన్స్ చెబుతున్నారు కానీ ఈ కపుల్ చెప్పకపోయే సరికి  వీరు జంటగా కనబడిన ప్రతిసారి ఇదిగో కత్రినా ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. రీసెంట్లీ విక్కీ- క్యాట్ వెకేషన్ వీడియో బయటకు రాగా సేమ్ ఇలాంటి న్యూసే స్ప్రెడ్ అవుతోంది. అందులో కత్రినా లూజ్ ఔట్ ఫిట్ ధరించడంతో పాటు చిన్నగా నడుస్తుండటంతో ఈసారి పక్కా క్యాట్ ప్రెగ్నెంట్ అంటూ డిసైడ్ అవుతున్నారు.
ఇప్పుడే కాదు గతంలో కూడా లండన్ వీధుల్లో బాలీవుడ్ క్యూట్ కపుల్ విక్కీ, కత్రినా చేతిలో చేయి వేసుకుని చక్కర్లు కొట్టినప్పుడు, పలు ఈవెంట్లలో సందడి చేసిన టైంలో కూడా క్యాట్ ప్రెగ్నెన్సీ అంటూ వార్తలు వచ్చాయి. ఇలా ఎన్నో సార్లు వచ్చినా ఎప్పుడూ రెస్పాన్స్ కాలేదు ఈ జోడీ. ఇక తన కో స్టార్స్ అంతా మదర్స్‌గా ప్రమోట్ కావడంతో  కత్రినాను కూడా తల్లైతే చూడాలంటూ ఎప్పటి నుండో రిక్వెస్ట్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.

Exit mobile version