Site icon NTV Telugu

Tollywood Heros: టాలీవుడ్ కొత్తతరం హీరోలు.. నటులే కాదు స్టోరీ సృష్టికర్తలు కూడా!

Tollywood Heros

Tollywood Heros

టాలీవుడ్‌లో ప్రస్తుతం కొత్తతరం హీరోలు సినిమాల్లో కేవలం నటనకే పరిమితం కాకుండా.. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంటి విభాగాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తూ ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తున్నారు. హీరోల మల్టీ టాలెంట్ కారణంగా ప్రేక్షకులకు కొత్త ఆలోచనలు, వినూత్న కథనాలు, బలమైన పాత్రలతో కూడిన సినిమాలు చూసే అవకాశం దక్కుతోంది. మల్టీ టాలెంట్ హీరోల జాబితాలో అడివి శేష్ ముందు వరుసలో ఉన్నారు. ‘క్షణం’, ‘గూఢచారి’ వంటి విజయాల తర్వాత ప్రస్తుతం ‘డాకోయిట్’, ‘జీ2’ చిత్రాలకు రచయితగా, స్క్రీన్‌ప్లే బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. కథా నిర్మాణంలో తనదైన ముద్ర వేసే శేష్.. టాలీవుడ్‌లో హీరో-రైటర్ కలయికకు మంచి ఉదాహరణగా నిలుస్తున్నారు.

విశ్వక్ సేన్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రచయితగా తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు. తన రాబోయే కల్ట్ సినిమా కోసం కథ రాయడమే కాకుండా.. దర్శకత్వ బాధ్యతలు కూడా స్వయంగా చేపట్టడం విశేషం. కొత్తదనం, ధైర్యమైన ప్రయోగాలు విశ్వక్ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. యువతకు బాగా కనెక్ట్ అయిన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ కూడా ఈ కొత్తతరం ట్రెండ్‌లో భాగమే. ‘టిల్లు’ సిరీస్‌తో సెన్సేషన్ సృష్టించిన సిద్ధు.. రాబోయే టిల్లు క్యూబ్ సినిమాకు రచయితగా, స్క్రీన్‌ప్లే బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. హాస్యం, డైలాగ్ టైమింగ్‌లో అతని రచన అద్భుతంగా ఉంది.

Also Read: IND vs NZ T20 Records: మూడేళ్ల తర్వాత భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్.. టీ20 రికార్డులు ఇవే!

తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే నవీన్ పోలిశెట్టి కూడా కథా రచనలో ముందడుగు వేశారు. ‘అనగనగా ఒక రాజు’ చిత్రానికి కథ, సంభాషణలు, స్క్రీన్‌ప్లే బాధ్యతలు మోశారు. మొత్తానికి టాలీవుడ్‌లో ఈ కొత్తతరం హీరోలు కేవలం తెరపై కనిపించే ముఖాలు మాత్రమే కాదు.. కథను సృష్టించే మైండ్, సినిమాకు దిశ చూపించే సృజనాత్మక శక్తులుగా మారుతున్నారు. ఈ మార్పు పరిశ్రమకు కొత్త ఊపును ఇచ్చి, ప్రేక్షకులకు మరింత నాణ్యమైన సినిమాలను అందిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Exit mobile version