Site icon NTV Telugu

Nenu Ready: హవీష్, నక్కిన ‘నేను రెడీ’ షూట్ మొదలు!

Nenu Ready

Nenu Ready

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హవీష్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నేను రెడీ’. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక టాకీ భాగం షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. హీరోతో పాటు ప్రధాన నటీనటులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

Also Read:Nani : జున్ను కాలు ఫ్రాక్చర్ అయింది.. నాని ఎమోషనల్

‘నేను రెడీ’ కోసం త్రినాథరావు నక్కిన తన స్టైల్‌లో సరికొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. కుటుంబం మొత్తం కలిసి ఆనందించేలా ఈ సినిమా ఉండబోతుంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, వీటి గణేషన్, అజయ్, మురళి గౌడ్, గోపరాజు, శ్రీకాంత్ అయ్యంగర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు. సినిమాకు ప్రతిభావంతులైన టెక్నికల్ టీం పనిచేస్తోంది. స్టార్ కంపోజర్ మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటింగ్, రఘు కులకర్ణి ప్రొడక్షన్ డిజైన్, విక్రాంత్ శ్రీనివాస్ కథ మరియు డైలాగ్స్ అందిస్తున్నారు.

Exit mobile version