Nelson Dilipkumar: 600 కోట్ల బ్లాక్ బస్టర్ సినిమా డైరెక్టర్ కి సినిమా ఛాన్స్ కావలెను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nelson Dilipkumar Struggiling to Get Movie Chance : సాధారణంగా ఒక సినిమా 100 కోట్ల రూపాయల కలెక్ట్ చేసిందంటేనే ఆ సినిమా డైరెక్టర్ కి తరువాతి సినిమా అవకాశాలు క్యూ కడతాయి. కానీ దురదృష్టమో లేక కాకతాళియమో తెలియదు కానీ సుమారు 600 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఇప్పుడు ఆ దర్శకుడికి సరైన సినిమా దొరకడం లేదు. ఆ సినిమా ఏంటి? ఆ దర్శకుడు ఎవరు? అనుకుంటున్నారు కదా. ఆ సినిమా పేరు జైలర్. డైరెక్టర్ పేరు నెల్సన్ దిలీప్ కుమార్. నెల్సన్ దిలీప్ కుమార్ చివరి సినిమాగా రజనీకాంత్ జైలర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాక ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయినా తర్వాత కూడా ఆయనకు సరైన సినిమా దక్కడం లేదు. జైలర్ సినిమా రిలీజ్ అయి ఏడాది పైన అవుతోంది.
CM Chandrababu: నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు..
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ఇప్పటివరకు ఆయన కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేయలేదు. ఎక్కువగా డార్క్ కామెడీ సినిమాలు చేస్తాడని పేరు తెచ్చుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ మొదటి సారిగా రజనీకాంత్ తో ఒక మంచి మాస్ మసాలా కమర్షియల్ సినిమాతో వచ్చాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత కూడా ఆయన మరో ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడడం హార్ట్ టాపిక్ అవుతుంది. అయితే కోలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఆయన జైలర్ 2 సినిమా కోసం పనిచేస్తున్నాడని అందుకే మరో ప్రాజెక్ట్ ఏదీ సెట్ చేసుకునే పనిలో లేడని చెబుతున్నారు. ఇక ఆ మధ్య కాలంలో ఆయన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలకు కథలు సిద్ధం చేసుకుంటున్నాడని ప్రచారం జరిగింది.
కానీ వాళ్ళిద్దరి లైన్ అప్స్ ప్రకారం మనోడి ప్రాజెక్టు సెట్ అవ్వడం కష్టమే. అయితే 100 కోట్ల రూపాయలు హిట్ ఇచ్చిన డైరెక్టర్లు కూడా బిజీ అయిపోతున్న తరుణంలో 600 కోట్ల రూపాయలు హిట్ ఇచ్చిన తర్వాత కూడా నెల్సన్ సైలెంట్ గా ఉండడం అది కూడా ఏడాది పైనే పూర్తవడం చర్చనీఅంశం అవుతుంది. అయితే తమిళంలో తెలుగుతో పోలిస్తే తక్కువ మంది స్టార్ హీరోలు ఉండడం కూడా ఇందుకు ఒక కారణం అని చెప్పవచ్చు. జైలర్ 2 కోసమే ఆయన సైలెంట్ అయ్యాడా? లేక హీరోలు లేక సైలెంట్ అయ్యాడా? అనేది కాలమే నిర్ణయించాలి.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..