NBK50inTFI : సింగపూర్ లో బాలయ్య 50ఇయర్స్ సినీ స్వర్ణోత్సవ వేడుకలు..
- బాలయ్య @ ఇయర్స్ ఇండస్ట్రీ
- సింగపూర్ లో సంబరాలు జరిపిన అభిమానులు
- బాలయ్య పాటలకు స్టెప్పులతో హోరెత్తించిన ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
31 ఆగస్టు, సింగపూర్: తెలుగు చలనచిత్ర రంగంలో అగ్రహీరో నందమూరి బాలకృష్ణ (NBK) గారి సినీ ప్రస్థానంలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా, NBK అభిమానులు సింగపూర్ లోని అభిరుచులు ఫంక్షన్ హాల్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 100 మందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం కేక్ కటింగ్ తో ప్రారంభమైంది, తదనంతరం ప్రముఖ సినీ దర్శకులు బోయపాటి శ్రీను, బి. గోపాల్, అనిల్ రావిపూడి తమ అభినందనలు తెలిపారు. NBK అభిమానులు బాలకృష్ణ గారి సినిమాలతో తమ అనుబంధాన్ని, అనుభవాలను పంచుకున్నారు. పాతూరి రాంబాబు మాట్లాడుతూ NBK గారి నుండి నేర్చుకున్న కుటుంబ విలువలు, సామాజిక సేవ, కష్టపడి పని చేసే స్వభావం వంటి విలువలను యువతకు ఎలా చేరవేయాలో వివరించారు. కార్యక్రమం సమయంలో NBK అభిమానులు బాలయ్య సినిమాల పాటలకు నృత్యాలు చేసి ఉత్సాహాన్ని నింపారు. ప్రతి ఒక్కరూ డ్యాన్స్ లో పాల్గొని, ఈవెంట్‌ను మరింత రసవత్తరంగా మార్చారు. ఈ వేడుక రుచికరమైన తెలుగు విందుతో ముగిసింది. సింగపూర్ లోని NBK అభిమానులు బాలకృష్ణ గారికి మంచి ఆరోగ్యం కలగాలని, ఇంకా మరిన్ని అద్భుతమైన సినిమాలు ఇవ్వాలని కోరుకుంటూ తమ మనస్పూర్తి అభిలాషలను తెలియజేశారు. కార్యక్రమ నిర్వాహకులు., ముఖ్యంగా బీమినేని వెంకట్ ,నాదెండ్ల మురళి,గుడిపూడి మధు & వెలగా బాలకృష్ణ గారికి మరియు అభిరుచులు రెస్టారెంట్ మేనేజ్‌మెంట్‌కి అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!