NBK 112: 150 కోట్లతో బాలయ్య-కొరటాల మాస్ బ్లాక్ బస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారైంది. బాలయ్య కెరీర్లో 112వ చిత్రంగా రాబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్ నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా లాంఛనంగా ప్రారంభం కానుంది. రేపు (గురువారం) ఉదయం సరిగ్గా 8 గంటలకు అమరావతిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ప్రముఖ నిర్మాత చెరుకూరి సుధాకర్ ఏకంగా రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాత చెరుకూరి సుధాకర్ తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. రాజధాని అమరావతిలో ఒక సినిమాను లాంచ్ చేయాలన్నది బాలకృష్ణ ఎప్పటినుంచో అంటున్న మాట అని, ఆ కల ఇప్పుడు తమ సినిమాతో నెరవేరుతుండటం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.
“గత మూడు నాలుగేళ్లుగా బాలకృష్ణ గారితో సినిమా చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. ఆ కోరిక ఇప్పటికి సాధ్యమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రకాశం జిల్లాకు చెందిన వాడిని. మన రాజధాని అమరావతిలో మా సినిమాను ప్రారంభించడం వ్యక్తిగతంగా నాకు ఎంతో గర్వకారణం.” అని నిర్మాత చెరుకూరి సుధాకర్ అన్నారు. ఈ సినిమా కేవలం వినోదాన్ని పంచడమే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక కళాకారులకు ఒక గొప్ప వేదికగా మారనుందని నిర్మాత స్పష్టం చేశారు. ఏపీలో అద్భుతమైన ప్రతిభ దాగి ఉందని, అలాంటి టాలెంటెడ్ వ్యక్తులకు అవకాశాలు కల్పించే దిశగా తమ సినిమా అడుగులు వేస్తుందని చెప్పారు. భవిష్యత్తులో ఏపీలో మరిన్ని ఫిల్మ్ స్టూడియోలు ఏర్పాటయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని సుధాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
- Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
- Vishwambhara vs Kaaka: 'విశ్వంభర' vs 'కాకా'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
- Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
బాలకృష్ణ ఊరమాస్ ఇమేజ్‌కు, కొరటాల శివ మార్క్ స్టైలిష్ టేకింగ్ తోడైతే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదు. ఈ సినిమా కంప్లీట్‌గా బాలయ్య మాస్, కొరటాల స్టైల్ కలయికగా ఉండబోతోందని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఆగస్టు నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.ఇప్పటికే ఫుల్ ఫామ్‌లో ఉన్న బాలయ్య, కొరటాల శివ లాంటి స్టార్ డైరెక్టర్‌తో చేతులు కలపడం.. అది కూడా అమరావతి వేదికగా 150 కోట్ల బడ్జెట్‌తో మొదలవుతుండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
-
Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
-
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
-
BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!