Manchu Manoj: మనోజ్‌కు డైరెక్టర్ గోపీచంద్ మాలినేని బర్త్ డే విషెస్.. బాలయ్య సినిమాలో మంచు మనోజ్ కీ రోల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Manoj: టాలీవుడ్ రాక్‌స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ అందింది. నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మాలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ #NBK111 టీమ్.. మంచు మనోజ్‌కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. మంచు మనోజ్ బర్త్ డేని పురస్కరించుకుని దర్శకుడు గోపీచంద్ మాలినేని సోషల్ మీడియా వేదికగా మనోజ్‌కు విషెస్ చెప్పారు. “మనోజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. సెట్స్‌లో అతని ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ అద్భుతంగా ఉంటాయి. #NBK111 చిత్రంలో అతనితో కలిసి పని చేయడానికి, అతని స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం” అంటూ పోస్ట్ చేశారు.
స్టైలిష్ అండ్ పవర్ఫుల్ పోస్టర్..
మనోజ్ బర్త్ డే సర్ప్రైజ్గా టీమ్ NBK111 ఒక ప్రత్యేకమైన పోస్టర్‌ను విడుదల చేసింది. క్లాసీ బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో డిజైన్ చేసిన ఈ పోస్టర్లో మంచు మనోజ్ సూట్ వేసుకొని, సరికొత్త హెయిర్‌స్టైల్‌తో పవర్ఫుల్ లుక్‌లో కనిపించారు. పోస్టర్లో ఉన్న బులెట్ ఇమేజరీ సినిమాలోని యాక్షన్ ఇంటెన్సిటీని సూచిస్తోంది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో మంచు మనోజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో మెరవబోతున్నట్లు టాక్. స్టార్ హీరోయిన్ నయనతారతో కలిసి ఆయన పాత్ర సాగుతుందని, బాలకృష్ణ – మనోజ్ మధ్య వచ్చే మైండ్ గేమ్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. గోపీచంద్ మాలినేని – బాలకృష్ణ కాంబోలో ఇప్పటికే వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఈ సరికొత్త ప్రాజెక్ట్ #NBK111 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి తోడు మంచు మనోజ్ లాంటి విలక్షణ నటుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. బాలయ్య సినిమాలో మంచు వారి అబ్బాయి భాగం కావడంతో నందమూరి ఫ్యాన్స్‌తో పాటు, మంచు అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Also Read
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
Happy Birthday dear @HeroManoj1 🤗
It’s always a delight to see your energy light up every place around you ❤️
Can’t wait to witness what’s in store with #NBK111 . pic.twitter.com/7P9mtnvDVh
— Gopichandh Malineni (@megopichand) May 20, 2026
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు