Nayanthara Remuneration Per Movie: సౌత్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో సీనియర్ కథానాయిక నయనతార ఒకరు. సినిమా ప్రమోషన్స్ చేయకపోయినా, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డుమ్మా కొట్టినా.. అమ్మడు అడిగినంత తప్పక ఇవ్వాల్సిందే. నయన్ గ్లామర్, నటన సినిమాకు అదనపు బలం కాబట్టి నిర్మాతలు భారీ మొత్తం చెల్లించుకోక తప్పట్లేదు. బాలీవుడ్ వెళ్లడానికి ముందు నయన్ రూ.4-6 కోట్లు ఛార్జ్ చేసేవారు. ‘జవాన్’ హిట్ పడ్డాక ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. జవాన్ కోసం రూ.10 కోట్లు తీసుకున్న నయన్.. సౌత్‌లో కూడా రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేశారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’లో నటించారు. ఈ సినిమా కోసం రూ.18 కోట్లు అడిగారట. ఒక్కసారిగా అవాక్కయిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. నయన్‌ను కన్విన్స్ చేసి తక్కువ పేమెంట్‌కే ఫిక్స్ చేశారని టాక్. పేమెంట్ తక్కువ చేయడమే కాదు.. నయనతారతో అనిల్ ప్రమోషన్స్ కూడా చేయించారు. ఇది గొప్ప విషయమే అనే చెప్పాలి. ఎందుకంటే.. నయన్ ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ఎస్కేప్ అయ్యారు. తాను నయన్‌ను ఒప్పించేందుకు స్వయంగా రంగంలోకి దిగనని అనిల్ రావిపూడి చెప్పిన విషయం తెలిసిందే.
Also Read: Team India Playing XI: ఆయుష్ అరంగేట్రం.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
మన శంకర్ వరప్రసాద్ గారు కన్న ముందే నయనతార మొదలు పెట్టిన మూకుత్తి అమ్మన్ 2కి మాత్రం రూ.12 కోట్లు ఛార్జ్ చేస్తుందని సమాచారం. ఈ సినిమాను వంద కోట్లతో తెరకెక్కిస్తున్నాయి నాలుగు ప్రొడక్షన్ హౌసెస్. మాలీవుడ్ చిత్రాలకు రూ.10-12 కోట్ల లోపు ఛార్జ్ చేస్తున్న నయన్.. పాన్ ఇండియా సినిమాలంటే మాత్రం రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. కేజీఎఫ్ హీరో యశ్ అప్ కమింగ్ ఫిల్మ్ ‘టాక్సిక్’లో నయన్ నటిస్తున్నారు. గంగ పాత్రలో అటు గ్లామర్.. ఇటు యాక్షన్ అవతార్‌లో నటిస్తున్న లేడీ సూపర్ స్టార్.. ఈ క్యారెక్టర్ కోసం రూ.18 కోట్లు అడిగారట. ఈ సినిమాకున్న డెప్త్, ఆ క్యారెక్టర్‌కు ఉన్న ఇంటెన్సిటీని దృష్టిలో పెట్టుకుని రూ.15 కోట్లకు టీం ఫైనల్ చేసిందన్నది లేటెస్ట్ టాక్. మొత్తానికి క్రేజ్ ఉన్నప్పుడే డిమాండ్ చేయాలన్న కాన్సెప్ట్ పెట్టుకున్నట్లున్నట్లు ఉన్నారు నయన్.
