లేడీ సూపర్ స్టార్ నయనతార, టాలెంటెడ్ యంగ్ హీరో కవిన్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్’ (HI) విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఒక ప్రత్యేక అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా వెల్లడించారు. ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు దర్శకుడు లోకేష్ కనగరాజ్తో కలిసి పనిచేసిన విష్ణు , *’హాయ్’*తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ మిలియన్ల వ్యూస్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై సంచలనం సృష్టించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార, యువ హీరో కవిన్ తొలిసారి జంటగా నటిస్తున్న ‘హాయ్’, ఈ చిత్రంలో కె. భాగ్యరాజ్, ప్రభు, రాధిక శరత్‌కుమార్, వీటీవీ గణేష్, సత్యన్, ఆదిత్య కదిర్, ఖురేషి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
జీ స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నయనతార, విగ్నేష్ శివన్, ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. నయనతార, విగ్నేష్ శివన్, ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి రాజేష్ శుక్లా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జెన్ మార్టిన్ సంగీతం సమకూరుస్తున్నారు, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా, ఎస్. కన్నన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. చెన్నై, కోయంబత్తూరు, పొల్లాచ్చి నేపథ్యంలో సాగే ఈ కథలో హాస్యం, భావోద్వేగాలు, కుటుంబ బంధాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి, ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’, ‘సంతోష్ సుబ్రహ్మణ్యం’, ‘యారడి నీ మోహిని’ తరహాలో సాంప్రదాయ విలన్ లేకుండా సాగే పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ‘

