టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.2011లో వచ్చిన “అందాల రాక్షసి” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు .తన టాలెంట్ తో తెలుగులో హీరోగా వరుస సినిమాలలో నటించి మెప్పించాడు.హీరోగా ,విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నవీన్ చంద్ర అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం నవీన్ చంద్ర గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ”గేమ్ ఛేంజర్”సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన ఇన్స్పెక్టర్ రుషి వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అదరగొడుతుంది .
ఇదిలా ఉంటే నవీన్ చంద్ర ఓ అరుదైన ఘనత సాధించాడు. గత ఏడాది విడుదలైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రం మంత్ ఆఫ్ మధు సినిమాలో నవీన్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ఆయన అద్భుతమైన నటనకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించింది.భారతీయ సినీ పరిశ్రమలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంత ప్రత్యేకత ఉంటుందో అందరికీ తెలుసు.ప్రతి ఏడాది విడుదలయ్యే సినిమాలు వివిధ విభాగాలలో పోటీపడుతాయి. అందులో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి నిర్వాహకులు ఈ పురస్కారాలను అందిస్తారు.2024 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా నవీన్ చంద్రకు ఈ అవార్డు దక్కింది. నవీన్ చంద్ర నటించిన మంత్ ఆఫ్ మధు అమెజాన్ ప్రైమ్ మరియు ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది.