నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ‘పలాస 1978’ వంటి విలక్షణమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం సమాజంలోని మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు మరియు డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్ చుట్టూ తిరుగుతుంది. OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇందులో దివి, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తుండగా, అజయ్ అరసాడ సంగీతాన్ని అందించారు. కాగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు.
Also Read : Allu Arjun : 2026లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టిన ఐకాన్ స్టార్.. ఫ్యాన్స్ కోసం ఎమోషనల్ నోట్!
ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త రకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడమే కాకుండా, సామాజిక అంశాలను కూడా చర్చించబోతోందని తెలుస్తోంది. టాప్ టెక్నీషియన్స్ పనిచేసిన ఈ మూవీ డిజిటల్ రైట్స్ విషయంలో కూడా క్రేజ్ సంపాదించుకుంది. ‘హనీ’ పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకోవడం విశేషం. సైకలాజికల్ డెప్త్ మరియు హారర్ అంశాల సమ్మేళనంగా వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధంగా ఉంది.
